📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్

Raakasa Movie: సంగీత్ శోభన్ ‘రాకాస’ గ్లింప్స్ విడుదల

Author Icon By Aanusha
Updated: January 24, 2026 • 7:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Sangeeth Shobhan’s ‘Raakasa’ Glimpses Released

‘కమిటీ కుర్రోళ్లు’ వంటి చిత్రం తర్వాత, నిర్మాతగా నిహారిక కొణిదెల మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ముందుకు వస్తున్నారు. ఆమె నిర్మాణ సంస్థ ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ బ్యానర్‌పై యువ హీరో సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘రాకాస’ (Raakasa Movie). ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేయగా, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

Read Also: Movie: రవితేజ సినిమాలో విలన్ గా ఎస్‌జే సూర్య?

మంచి స్పందన

ఈ గ్లింప్స్ ప్రారంభంలో ఎంతో గంభీరంగా సాగుతూ.. యుగయుగాలుగా ప్రతీ కథలోనూ ఒక సమస్య ఉంటుందని, దాన్ని పరిష్కరించేందుకు ఒక వీరుడు పుడతాడని, ఆ వీరుడు తనేనంటూ హీరో ఇచ్చే ఎలివేషన్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంది. అయితే వెంటనే కథలో కామెడీ, సెటైరికల్ ట్విస్ట్ మొదలై ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతుంది.

సంగీత్ శోభన్ తనదైన కామెడీ టైమింగ్‌తో మరోసారి మెప్పించనున్నట్లు ఈ గ్లింప్స్ ద్వారా అర్థమవుతోంది. నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు. నిహారిక కొణిదెలతో కలిసి ఉమేష్‌కుమార్ బన్సల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ క్రేజీ ఎంటర్టైనర్ ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదల కానుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

latest news Niharika Konidela pink elephant pictures Rakasa movie Sangeeth Shobhan Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.