📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Samyuktha Menon – గ్యాప్ తీసుకోలేదు .. వచ్చింది.. సెకండ్ ఇన్నింగ్స్ తో మొదలుపెడతా : సంయుక్త

Author Icon By Anusha
Updated: September 12, 2025 • 4:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మలయాళ భామ సంయుక్త మీనన్ టాలీవుడ్‌ (Tollywood) లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న నటి. ‘భీమ్లా నాయక్’, ‘బింబిసార’, ‘సార్’, ‘విరూపాక్ష’ వంటి వరుస హిట్ సినిమాలతో ఆమెకు “లక్కీ హీరోయిన్” అనే ట్యాగ్ కూడా వచ్చింది. అయితే, గత కొంతకాలంగా వెండితెరపై కనిపించకపోవడంతో అభిమానులు ఆమె గైర్హాజరీపై అనేక ప్రశ్నలు వేసుకున్నారు. ఈ నేపథ్యంలో సంయుక్త తన గ్యాప్‌ గురించి క్లారిటీ ఇచ్చారు. తాను కావాలని విరామం తీసుకోలేదని, ఒప్పుకున్న ప్రాజెక్టులు పూర్తి కావడంలో ఆలస్యం కావడంతోనే ఈ గ్యాప్ వచ్చిందని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

ఇక ఇప్పుడు సంయుక్త (Samyuktha Menon) మళ్లీ పెద్ద ఎత్తున సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి ఆమె రీ-ఎంట్రీ జరగబోతోంది. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘అఖండ 2’ (‘Akhanda 2’) లో సంయుక్త కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ ఈ సినిమా డిసెంబర్‌లో విడుదలయ్యే అవకాశముందని సంకేతాలు ఇచ్చారు. దీంతో సంయుక్త తిరిగి ఎంట్రీ గ్రాండ్‌గా ఉండబోతోందని చెప్పొచ్చు.

‘స్వయంభు’లోనూ సంయుక్త ముఖ్యమైన పాత్ర

అంతేకాదు, వచ్చే సంక్రాంతి పండుగ కోసం సిద్ధమవుతున్న మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘నారీ నారీ నడుమ మురారీ’లోనూ ఆమె నటిస్తున్నారు. ఈ సినిమాతో యువతను ఆకట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు.ఇకపోతే, యంగ్ హీరో నిఖిల్ (Young hero Nikhil) నటిస్తున్న పౌరాణిక నేపథ్య చిత్రమైన ‘స్వయంభు’లోనూ సంయుక్త ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు.

Samyuktha Menon

అలానే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas) హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘హైందవ’లో కూడా ఆమె కనిపించనున్నారు. ఈ రెండు చిత్రాల ద్వారా సంయుక్త భిన్నమైన రోల్స్‌లో ప్రేక్షకులను అలరించనున్నారు.ఇవే కాకుండా, టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో కూడా ఆమె నటించబోతున్నారని సమాచారం. ఈ సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఇతర భాషల్లోనూ సంయుక్త తన హవా

ఒక్క టాలీవుడ్‌లోనే కాకుండా ఇతర భాషల్లోనూ సంయుక్త తన హవాను కొనసాగించనున్నారు. బాలీవుడ్‌లో ‘మహారాజ్ఞి: క్వీన్ ఆఫ్ క్వీన్స్’ చిత్రంతో అరంగేట్రం చేస్తున్నారు. అలాగే, మలయాళం (Malayalam) లో చాలాకాలంగా నిర్మాణంలో ఉన్న మోహన్‌లాల్-జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లోని ‘రామ్’ చిత్రం కూడా వచ్చే ఏడాదే విడుదల కానుంది.

ఇక లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రాబోతున్న ‘బెంజ్’ అనే మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులోనూ ఆమె భాగమయ్యారు. ఈ సినిమాలన్నీ 2026 నాటికి విడుదల కానుండటంతో, రాబోయే రోజుల్లో సంయుక్త కెరీర్ మరో స్థాయిలో ఉండనుందని స్పష్టమవుతోంది. 

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/tilak-varma-my-favorite-hero-is-prabhas-tilak-varma/sports/546013/

Bheemla Nayak Bimbisara Breaking News Comeback film lineup latest news lucky heroine Malayalam Actress Samyuktha Menon SIR Telugu News tollywood Virupaksha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.