📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Sampradayini Suppini Suddapoosani Review: క్రైమ్ కామెడీ వర్కవుట్ అయిందా? సినిమా ఎలా ఉందంటే!

Author Icon By Anusha
Updated: March 6, 2026 • 2:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Sampradayini Suppini Suddapoosani Review: టాలీవుడ్ సీనియర్ హీరో శివాజీ, లయ జంటగా నటించిన చిత్రం సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శివాజీ స్వయంగా నిర్మించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్‌తో కలిసి నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటిలు ఈ సినిమాకు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో మాస్టర్ రోహన్, శరత్ లోహితాశ్వ, ఆలీ, ధన్‌రాజ్, ప్రిన్స్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, రాజ్ తిరందాస్, కరణ్ తదితరులు నటించారు. ఈ సినిమా నేడు (మార్చి 6) థియేటర్లలో రిలీజ్ అయింది. మిస్సమ్మ, అదిరిందయ్యా చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా ఇలా మూడు సినిమాల్లో జంటగా నటించిన శివాజీ-లయ చాన్నాళ్ల తర్వాత మళ్లీ ఇందులో జంటగా కనిపించారు. మరి శివాజీ క్రైమ్ కామెడీ వర్కవుట్ అయిందా? అనేది పూర్తి రివ్యూలో చూద్దాం.

Read Also: S. Saraswathi Movie Review: సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘సరస్వతి’ మెప్పించిందా?

కథ
నీతి, నిజాయితీ గల పంచాయతీ కార్యదర్శి శ్రీరామ్ (శివాజీ). ఎమ్మెల్యే నుంచి మినిస్టర్ వరకూ ఎవరు కాల్ చేసినా కూడా తప్పు చేయకుండా తన పని తాను నిజాయతీగా చేస్తుంటాడు. ఇక తన భార్య ఉత్తర (లయ), కొడుకు మిథిల్ (రోషన్).. చేసే పనులు చూసి తలబాదుకుంటూ ఉంటాడు. వాళ్లు సరదాగా చేసే పనులు ఏదో ఒకరోజు తన పీక మీదకి వస్తాయంటూ వెటకారం ఆడుతూ ఫ్రస్ట్రేట్ అవుతుంటాడు.అంతా బానే ఉందిగా అనుకునే సమయానికి దీపావళి రోజు తన ఇంటికి వచ్చిన ఊరి ఎస్ఐ విక్రమ్( ప్రిన్స్) హత్యకి గురవుతాడు. అసలు విక్రమ్‌ని ఎవరు చంపారు? ఈ క్రైమ్‌లో శ్రీరామ్ ఫ్యామిలీ ఎందుకు ఇరుక్కోవాల్సి వచ్చింది. అసలు విక్రమ్ శవాన్ని మాయం చేసి, ఈ క్రైమ్ నుంచి తప్పించుకోవాలని శ్రీరామ్ భార్య ఉత్తర వేసిన ప్లాన్ వర్కవుట్ అయిందా? ఈ డ్రామాలో లోకల్ ఎమ్మెల్యేకి సంబంధమేంటి? అసలు చివరికి వీళ్ల ఫ్యామిలీ ఇందులోనుంచి ఎలా బయటపడింది అనేదే మిగిలిన కథ.

Sampradayini Suppini Suddapoosani Review

నటీనటుల పనితీరు

నటన విషయానికొస్తే శివాజీ ఎప్పటిలానే యాక్టింగ్ వరకూ తన పని తాను చేసుకుంటూ పోయాడు. ఎమోషనల్ సీన్లలో కూడా తన నటన పదను చూపించాడు. కానీ ఆ ఎమోషనల్ సీన్లలో బలం లేకపోవడంతో పెద్దగా వర్కవుట్ కాలేదు. లయ కాస్త కామెడీ, ఇంకాస్త క్రిమినల్ మైండ్ ఉన్న క్యారెక్టర్‌లో ఫర్వాలేదనిపించారు. ఇక రోషన్ చేసిన కామెడీ ఎక్కలేదు. ఆలీ, ధన్‌రాజ్, ప్రిన్స్, కాదంబరి, చిత్రం శీను సహా మిగిలినవారంతా తమ పాత్రలకి ఉన్నంతలో చెప్పినంతలో న్యాయం చేశారు. ఇక సినిమా అయిపోయాక ఎండ్ కార్డ్స్ పడుతుండగా బండ్ల గణేష్ చేత చేయించిన పాయ పాయ సాంగ్ కూడా థియేటర్లో ఆడియన్స్‌ సహనాన్ని పరీక్షిస్తుంది. ఈ పాట చూసిన తర్వాత పాయ పాయ.. సినిమా కూడా పాయె అన్న ఫీలింగ్ కలుగుతుంది!

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ETV Win Original Movie Sampradayini Suppini Suddapoosani Review Shivaji Laya New Movie Telugu cinema

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.