📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Samantha: సమంత నెక్స్ట్ సినిమా అప్డేట్ వచ్చేసింది

Author Icon By Anusha
Updated: October 6, 2025 • 1:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha), కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండటంతో, ఆమె రీఎంట్రీపై అభిమానులలో సందిగ్ధం నెలకొంది.. సినిమాలకు దూరంగా ఉంటున్న స్టార్ హీరోయిన్ సమంత, తన రీఎంట్రీపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తన కొత్త చిత్రం ‘మా ఇంటి బంగారం’ షూటింగ్ అప్డేట్‌ను అధికారికంగా వెల్లడించారు.

Kantara 2 box office : కాంతరా 2 బాక్స్ ఆఫీస్ కలెక్షన్ దుమ్ము లేపుతున్న రిషబ్ శెట్టి

ఈ నెలలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లు ఆమె స్పష్టం చేశారు.సోషల్ మీడియా (Social media) లో అభిమానులతో నిర్వహించిన చిట్ చాట్‌లో భాగంగా, ఓ నెటిజన్ ‘మా ఇంటి బంగారం’ సినిమా గురించి అడిగిన ప్రశ్నకు సమంత స్పందించారు. “మీ అందరి అనుమానాలకు నేను సమాధానం ఇవ్వబోతున్నాను. ఈ నెలలోనే ‘మా ఇంటి బంగారం’ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది.

చాలా సంతోషంగా ఉంది. నా రీఎంట్రీ గురించి అడుగుతున్న ప్రశ్నలన్నింటికీ ఈ సినిమాతోనే సమాధానం చెబుతాను” అని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రకటనతో సమంత అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఆరోగ్య సమస్యల కారణంగా నటనకు విరామం తీసుకున్న సమంత, ఇక సినిమాల్లోకి తిరిగి రాదని, రెండో పెళ్లి చేసుకొని సెటిల్ అవుతుందని విస్తృతంగా ప్రచారం జరిగింది.

Samantha

సోషల్ మీడియాలో అభిమానులతో నిర్వహించిన చిట్ చాట్‌లో భాగంగా

ఇటీవల ఆమె నిర్మాతగా మారి ‘శుభం’ అనే చిత్రాన్ని నిర్మించినా, నటిగా ఆమె మళ్లీ ఎప్పుడు కనిపిస్తారనే దానిపై స్పష్టత కొరవడింది. తాజా ప్రకటనతో ఆమె తన కెరీర్‌పై వస్తున్న వదంతులకు ఫుల్‌స్టాప్ పెట్టినట్లయింది. ‘ఖుషీ’ (‘Khushi’ movie) తర్వాత సమంత పూర్తిస్థాయి పాత్రలో నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం.

‘మా ఇంటి బంగారం’ మహిళా ప్రాధాన్య కథాంశంతో, పవర్‌ఫుల్ పాత్రలో సమంత కనిపించనున్నారని గతంలో విడుదలైన ఫస్ట్ లుక్ ద్వారా తెలిసింది. ఇక వ్యక్తిగత జీవితం విషయానికొస్తే, దర్శకుడు రాజ్ నిడిమోరు (Raj Nidimoru) తో ఆమె డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ, వాటిపై ఆమె స్పందించలేదు. ప్రస్తుతం తన పూర్తి దృష్టిని కెరీర్‌పైనే పెట్టినట్లు తాజా ప్రకటనతో స్పష్టమవుతోంది. 

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

actress Breaking News film shooting latest news Maa Inti Bangaram movie update re-entry Samantha South Indian Cinema Telugu News tollywood

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.