ప్రముఖ నటి సమంత (Samantha) తాజాగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ప్రముఖ దర్శక-నిర్మాత రాజ్ నిడిమోరును ఆమె వివాహం చేసుకున్నారు. గత కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ వస్తున్న వార్తలకు తెరదించుతూ, కోయంబత్తూరులోని ఇషా ఆశ్రమంలో వీరి పెళ్లి వేడుక ఆధ్యాత్మిక వాతావరణంలో నిరాడంబరంగా జరిగింది.
Read Also: OTT: ఓటీటీలోకి వచ్చేసిన రష్మిక హిట్ మూవీ
నెట్టింట హాట్ టాపిక్‌గా ఫ్యామిలీ ఫోటో
ఈ పెళ్లికి చాలా తక్కువ మందిని మాత్రమే ఆహ్వానించినప్పటికీ, పెళ్లి ఫోటోలు బయటకు రావడంతో సోషల్ మీడియా మొత్తం సమంత (Samantha) పెళ్లి హడావుడితో నిండిపోయింది. ప్రత్యేకంగా, రాజ్ కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఒక ఫ్యామిలీ ఫోటో ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఫోటోని రాజ్ నిడిమోరు (Raj Nidimoru) సోదరి శీతల్ నిడిమోరు స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
“నా ఆనందాన్ని వ్యక్తపరచడానికి మాటలు సరిపోవు. నేటితో మా కుటుంబం సంపూర్ణమైంది. సమంత–రాజ్ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటున్నా. పరస్పర గౌరవం, నిజాయతీ ఉన్నప్పుడే వివాహ జీవితం అందంగా మారుతుంది. సమంతకు మేమంతా జీవితాంతం అండగా ఉంటాం” అని శీతల్ నిడిమోరు (Sheetal Nidimoru) పేర్కొంది. ఈ పోస్ట్‌పై సమంత కూడా ప్రేమతో స్పందిస్తూ “Love you” అని రిప్లై ఇచ్చింది.
సమంత మొదటి సినిమా ఏది?
సమంత నటించిన మొదటి సినిమా ‘ఏ మాయ చేసావే’.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: