బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజ్ నిడుమోరు (Samantha-Raj Nidimoru)తో సమంత డేటింగ్‌లో ఉన్నారంటూ గత కొంత కాలంగా తెగ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. త్వరలో వీరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ రూమర్సే నిజమయ్యాయి. సామ్-రాజ్ (Samantha-Raj Nidimoru) వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
Read Also: Andhra King Taluka day 3 collection : రామ్ పోతినేని సినిమా ఇబ్బందుల్లో.. ₹50 కోట్ల లక్ష్యం దూరమేనా?
లింగ భైరవి ఆలయంలో వీరి వివాహం జరిగింది
కోయంబత్తూర్‌లోని ఇషా యోగా సెంటర్ (Isha Yoga Centre)లో గల లింగ భైరవి ఆలయం (Ling Bhairavi Temple)లో వీరి వివాహం జరిగింది. రాజ్ తో సమంత పెళ్లి ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం సామ్ షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.
అందులో సామ్ ఎరుపు రంగు చీరలో మరింత అందంగా ముస్తాబుకాగా..క్రీమ్ , గోల్డెన్ కలర్ షర్వానీ ధరించారు రాజ్. ఆ ఫోటోలలో ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారని.. కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్యాన్స్.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: