📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Samantha: విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడిపై స్పందించిన సమంత

Author Icon By Aanusha
Updated: October 5, 2025 • 6:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రసిద్ధ నటి సమంత రూత్ ప్రభు ఇటీవల విద్యార్థుల జీవితానికి సంబంధించి తన విలువైన అభిప్రాయాలను పంచుకుంది. మంచి మార్కులు, గ్రేడులే జీవితంలో సర్వస్వం కావని, వాటికంటే ముఖ్యమైనవి మానవతా విలువలని ప్రముఖ నటి సమంత (Samantha) రూత్ ప్రభు అన్నారు. విద్యార్థులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్రమైన ఒత్తిడిపై ఆమె స్పందిస్తూ, చదువుతో పాటు మంచి మనుషులుగా ఎదగడంపై దృష్టి పెట్టాలని సూచించారు.

Srinidhi Shetty: వారి ఇద్దరి సినిమాలకు డేట్స్ అడ్జెస్ట్ చేస్తా: శ్రీనిధి

ఆదివారం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన సమంత, ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. “చదువుతో పాటు ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? సమయం దొరకడం లేదు” అని ఆ విద్యార్థి ప్రశ్నించగా, సమంత స్పందించారు.

“నిజాయతీగా చెప్పాలంటే నేను విద్యార్థిగా ఉండి చాలా కాలమైంది. కానీ ప్రస్తుత విద్యార్థులు పడుతున్న ఇబ్బందుల గురించి వింటున్నాను. వారిపై ఒత్తిడి (Stress) చాలా ఎక్కువగా ఉంది” అని అన్నారు.

Samantha

తాను పాఠశాలలో చదువుకున్న విషయాలు ఇప్పుడు ఏవీ గుర్తులేవని, కానీ ఆ సమయంలో నేర్చుకున్న స్నేహం, దయ, సానుభూతి, ఇతరుల పట్ల గౌరవం వంటి లక్షణాలే తన జీవితంలో ఎంతగానో ఉపయోగపడ్డాయని సమంత వివరించారు.

మంచి మనిషిగా ఎలా ఉండాలో నేను పాఠశాలలోనే నేర్చుకున్నా

“మంచి మనిషిగా ఎలా ఉండాలో నేను పాఠశాల (School) లోనే నేర్చుకున్నాను. జీవితంలో ముందుకు సాగడానికి అవే నాకు తోడ్పడ్డాయి” అని ఆమె తెలిపారు. విద్యార్థులు మంచి గ్రేడులకే పరిమితం కాకుండా ఈ విలువలను అలవర్చుకోవాలని ఆమె హితవు పలికారు.ఈ సందర్భంగా, 2023లో దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగాయని,

మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదయ్యాయని తెలిపే ఓ వార్తా కథనాన్ని ఆమె పంచుకుని తన విచారాన్ని వ్యక్తం చేశారు.ఇదే సమయంలో తన తదుపరి ప్రాజెక్టుల గురించి కూడా సమంత ఓ శుభవార్త పంచుకున్నారు. చాలాకాలంగా ఎదురుచూస్తున్న తన కొత్త తెలుగు సినిమా షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుందని ఆమె వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News education and human values latest news mental health for students samantha quotes Samantha Ruth Prabhu samantha social media interaction student stress advice Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.