हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

Samantha: ‘మా ఇంటి బంగారం’ కొత్త పోస్టర్ విడుదల

Anusha
Samantha: ‘మా ఇంటి బంగారం’ కొత్త పోస్టర్ విడుదల

నందినీ రెడ్డి దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత (Samantha) నటిస్తున్న తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ చిత్రం యొక్క కొత్త పోస్టర్ విడుదలైంది. ఈ సినిమా ద్వారా సమంత ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 9వ తేదీన ఉదయం 10 గంటలకు ట్రైలర్ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇది నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత నటిస్తున్న మూడో చిత్రమిది.

Read also: Telangana: డ్రగ్స్ కేసు.. హైకోర్టును ఆశ్రయించిన నటి రకుల్ సోదరుడు

సమంత (Samantha) ప్రస్తుతం సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ప్రధానంగా వెబ్ సిరీస్‌లపై ఎక్కువ ఫోకస్ పెట్టిన ఆమె, ‘ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్: హనీ బన్నీ’ వంటి ప్రాజెక్ట్‌లతో తన పరిధిని బాలీవుడ్, ఓటిటి వరకూ విస్తరించింది. ఇదే సమయంలో తన వ్యక్తిగత జీవితంలోనూ కొత్త చాప్టర్ ప్రారంభించి, ప్రొడ్యూసర్‌గా కూడా అడుగులు వేసింది. తెలుగులో ఇటీవల ‘శుభం’ సినిమాలో చిన్న క్యామియోతో ప్రేక్షకులను పలకరించింది సమంత.

ఎంతో ప్రత్యేకమైన చిత్రం

ఈ సినిమాకు కథను సమంత మాజీ భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడుమోరు అందించడం విశేషం. అలాగే ఈ ప్రాజెక్ట్‌ను సమంత స్వయంగా తన బ్యానర్‌లో నిర్మించడంతో, ‘మా ఇంటి బంగారం’ ఆమెకు ఎంతో ప్రత్యేకమైన చిత్రంగా మారింది. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటంతో, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు కంటెంట్ పరంగా కూడా బలంగా ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. సమంత కెరీర్‌లో ఇది మరో కీలకమైన మలుపుగా మారే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి, వెబ్ సిరీస్‌లతో గ్లోబల్ రీచ్ సాధించిన సమంత, ఇప్పుడు మళ్లీ తెలుగులో ఒక పవర్‌ఫుల్ థియేట్రికల్ ప్రాజెక్ట్‌తో రాబోతుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. జనవరి 9న విడుదలయ్యే టీజర్‌తో ఈ సినిమా పై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశముంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870