📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

News Telugu: Samantha: నా విడాకులు కొందరికి ఆనందాన్ని ఇచ్చింది: సమంత

Author Icon By Rajitha
Updated: October 24, 2025 • 10:56 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Samantha: ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు తన వ్యక్తిగత జీవితంలోని కష్టాలపై ముక్కుసూటిగా స్పందించారు. విడాకులు తీసుకున్న సమయంలో, అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న రోజుల్లో, కొందరు వ్యక్తులు తన బాధను ఎగతాళి చేసినట్లు ఆమె తెలిపారు. అయితే ఇప్పుడు అలాంటి విమర్శలను పూర్తిగా పట్టించుకోవడం మానేశానని సమంత స్పష్టం చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సమంత, “నా జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదురయ్యాయి. నాగ చైతన్య Naga chaitanya) తో విడిపోయినప్పుడు, ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కొందరు ఆనందపడ్డారు. నా భవిష్యత్తుపై తామే తీర్పు చెప్పినట్టుగా మాట్లాడారు. ఆ సమయంలో చాలా బాధ పడ్డాను. కానీ ఇప్పుడు నేర్చుకున్నాను — ఎవరి మాటలకీ నా మనసు కదలదు” అని చెప్పారు. తనకు మయోసైటిస్ (Myositis) అనే వ్యాధి వచ్చినప్పుడు కూడా కొందరు తప్పుడు వార్తలు ప్రచారం చేశారని, వాటిని లెక్క చేయకపోవడమే తనకు శాంతి ఇచ్చిందని పేర్కొన్నారు.

Read also: Wash Level 2: ఓటీటీలోకి వాష్ లెవల్ 2 ఎప్పుడంటే?

Samantha: నా విడాకులు కొందరికి ఆనందాన్ని ఇచ్చింది: సమంత

“ప్రతిసారి స్పందించడం కంటే మౌనం శక్తివంతం. ఇప్పుడు నాకు అంతర్గత శాంతి దొరికింది” అని అన్నారు. సమంత ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆమె అభిమానులు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. “సమంత (Samantha) నిజమైన ఫైటర్”, “ఆమె ధైర్యం అందరికీ ప్రేరణ” అంటూ మద్దతు తెలుపుతున్నారు. సినీ రంగంలో ప్రస్తుతం సమంత ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నారు. రాజ్ & డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. తెలుగులో ఆమె నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న మా ఇంటి బంగారం’ సినిమాలో కూడా నటించబోతున్నారు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఓ బేబీ’ చిత్రం మంచి విజయాన్ని సాధించినందున, ఈ కొత్త సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.

సమంత ఏ అంశంపై స్పందించారు?
తన విడాకులు, అనారోగ్య సమయంలో కొందరు ఎగతాళి చేసిన విషయంపై సమంత స్పందించారు.

విడాకుల తర్వాత సమంత ఎలా స్పందించింది?
మొదట్లో బాధపడ్డానని, కానీ ఇప్పుడు అలాంటి విమర్శలను పట్టించుకోనని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Divorce emotional interview latest news Myositis Samantha Ruth Prabhu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.