हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Salman Khan: సల్మాన్ ఖాన్ కు చంపేస్తామంటూ బెదిరింపులు

Sharanya
Salman Khan: సల్మాన్ ఖాన్ కు చంపేస్తామంటూ బెదిరింపులు

బాలీవుడ్ టాప్ హీరోలైన సల్మాన్ ఖాన్ (Salman Khan) మరియు షారుఖ్ ఖాన్లకు (Shahrukh Khan) ఇటీవల అందిన బెదిరింపులు ఇప్పుడు హిందీ సినిమా పరిశ్రమలో తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి. ఇప్పటికే గతంలోనూ వీరిద్దరికి పలు సార్లు బెదిరింపులు వచ్చినప్పటికీ, తాజాగా మరోసారి పునరావృతం కావడం భద్రతాపరంగా పెద్ద ప్రశ్నలు తీసుకొస్తోంది.

సల్మాన్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపు?

జూన్ 5న గురువారం రాత్రి ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు ఒక బెదిరింపు సందేశం అందింది. “మై సికిందర్ హూఁ” అనే పాట రచయితను ప్రస్తావిస్తూ వచ్చిన ఈ సందేశంలో, నటుడు సల్మాన్ ఖాన్ నుంచి రూ.5 కోట్లు డిమాండ్ చేశారు. ఈ బెదిరింపు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై వర్లీ పోలీసులు గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. సల్మాన్ ఖాన్‌కు గతంలోనూ పలుమార్లు ఈ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే.

షారుఖ్ ఖాన్‌కు ఫోన్ ద్వారా ప్రాణహాని బెదిరింపు

ఇక జూన్ 3న, ముంబై బాంద్రా పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఫోన్ కాల్ ఒక శాక్‌కు గురి చేసింది. ఒక అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి, షారుఖ్ ఖాన్‌ను చంపేస్తానని బెదిరించాడు. రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఫోన్ చేసిన వ్యక్తి తనను తాను “హిందుస్థానీ”గా పరిచయం చేసుకున్నాడు. డిమాండ్ చేసిన డబ్బు ఇవ్వకపోతే షారుఖ్ ఖాన్‌ను హతమారుస్తానని హెచ్చరించినట్లు పోలీసులు తెలిపారు.

భద్రత పెంపు – పోలీసుల అప్రమత్తత

ఈ కాల్‌ను ట్రేస్ చేయగా, అది ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన ఫైజాన్ ఖాన్ అనే న్యాయవాది పేరు మీద ఉన్నట్లు తేలింది. అయితే, తన ఫోన్ దొంగిలించబడిందని ఫైజాన్ ఖాన్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ముంబై పోలీసులు అతడిని విచారణ నిమిత్తం పిలిపించారు.

గతంలో షారుఖ్ ఖాన్‌ కు బెదిరింపులు

గతంలో షారుఖ్ ఖాన్‌కు బెదిరింపులు వచ్చాయి. ముఖ్యంగా 2023 అక్టోబర్‌లో ‘పఠాన్’, ‘జవాన్’ సినిమాల విడుదల సమయంలో వచ్చిన బెదిరింపుల నేపథ్యంలో ఆయన భద్రతను వై-ప్లస్ కేటగిరీకి పెంచారు. ప్రస్తుతం తాజా బెదిరింపుల నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. రెండు వేర్వేరు ఘటనలపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్లు ముంబై పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ వరుస బెదిరింపులతో బాలీవుడ్‌లో భద్రతాపరమైన ఆందోళనలు మళ్లీ తెరపైకి వచ్చాయి.

Read also: Manchu Lakshmi: కన్నప్ప సినిమాపై మనసులో మాట బయట పెట్టిన మంచు లక్ష్మి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870