Salman Khan: సల్మాన్ ఖాన్ మూవీకి కొత్త టైటిల్ ‘మాతృభూమి  మే వార్ రెస్ట్ ఇన్ పీస్’ 

Read Time:  1 min
Salman Khan: సల్మాన్ ఖాన్ మూవీకి కొత్త టైటిల్ ‘మాతృభూమి  మే వార్ రెస్ట్ ఇన్ పీస్' 
Salman Khan: సల్మాన్ ఖాన్ మూవీకి కొత్త టైటిల్ ‘మాతృభూమి  మే వార్ రెస్ట్ ఇన్ పీస్' 
FONT SIZE
GET APP

Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ వార్ డ్రామా టైటిల్‌లో మార్పు జరిగింది. ఇప్పటివరకు ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ అని పిలిచిన ఈ చిత్రానికి ‘మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్’ అనే ఆసక్తికరమైన కొత్త టైటిల్‌ను ఖరారు చేశారు.

కొత్త టైటిల్‌తో పాటు “యుద్ధానికి శాంతి చేకూరాలి” (May War Rest in Peace) అనే బలమైన సందేశంతో కూడిన ఆకట్టుకునే పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో, మేకులు కొట్టిన కర్ర దుంగ వెనుక నుంచి సల్మాన్ ఖాన్ తీక్షణంగా చూస్తున్నట్టుగా కనిపించారు. ఈ కొత్త టైటిల్, దాని వెనుక ఉన్న సందేశం ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టేలా ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

Read Also: Priyanka Chopra: ఆస్కార్ వేదికపై ప్రియాంక చోప్రా

Salman Khan: సల్మాన్ ఖాన్ మూవీకి కొత్త టైటిల్ ‘మాతృభూమి  మే వార్ రెస్ట్ ఇన్ పీస్' 
Salman Khan: New Title for Salman Khan’s Movie ‘Matrubhoomi War Rest in Peace’

ఆకట్టుకుంటున్న కొత్త పోస్టర్

2020 జూన్ 15న గాల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. అపూర్వ లఖియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు పాత్రను పోషిస్తున్నారు. వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి బలగాల ఉపసంహరణ ఒప్పందాన్ని అమలు చేసే బాధ్యతను నిర్వర్తించిన 16వ బీహార్ రెజిమెంట్ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో సల్మాన్‌కు జోడీగా చిత్రాంగద సింగ్ నటిస్తుండగా, అభిలాష్ చౌదరి, అంకుర్ భాటియా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గతంలో విడుదలైన ఫస్ట్ లుక్‌లో సైనికుడి పాత్ర కోసం మీసంతో, రగ్డ్డ్ అవతార్‌లో సల్మాన్ కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.