నాగ చైతన్య, సాయి పల్లవి (Sai Pallavi) నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమా, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ లో నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మించారు. 2021 సెప్టెంబర్ లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లకు కళ తీసుకొచ్చింది. తక్కువ టికెట్ రేట్లతో, 50 శాతం ఆక్యుపెన్సీ కండిషన్స్ తో విడుదలైనప్పటికీ, మంచి కలెక్షన్స్ రాబట్టగలిగింది. అలాంటి చిత్రాన్ని మరోసారి థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు నాగ చైతన్య ప్రకటించారు.
Read Also: Cheekatilo: ‘చీకటిలో’ (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!
ప్రేమకావ్యం
ఈ ఆల్ టైమ్ క్లాసిక్ రొమాంటిక్ సాగా ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రీరిలీజ్ చేస్తున్నారు.SVCLLP, అమిగోస్ క్రియేషన్ బ్యానర్లపై నిర్మాతలు నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని ఒక ప్రేమకావ్యంగా తీర్చిదిద్దారు. తెలంగాణ గ్రామానికి చెందిన డ్యాన్సర్ గా నాగ చైతన్య, అద్భుత నటనతో సాయి పల్లవి ఆకట్టుకున్నారు.
కుల, వర్గ భేదాలను దాటిన వీరి ప్రేమ కథ, గ్రామీణ తెలంగాణ జీవనశైలిని సున్నితంగా తెరపై ఆవిష్కరించారు దర్శకుడు శేఖర్ కమ్ముల. ‘నీ చిత్రమ్ చూసి’, ‘సారంగ దరియా’ పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. చైతన్య–సాయి పల్లవి (Sai Pallavi) అభిమానులు సినీ ప్రేమికులు ఈ ఆల్-టైమ్ క్లాసిక్ ని మరోసారి బిగ్ స్క్రీన్ పై ఎంజాయ్ చేయడానికి రెడీ అవుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: