📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్

Latest News: Sai Pallavi – శింబుతో జోడీ కట్టబోతున్న సాయిపల్లవి?

Author Icon By Anusha
Updated: September 14, 2025 • 11:54 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సినీ పరిశ్రమలో చాలామంది హీరోయిన్లు రాణించాలంటే బోల్డ్ రోల్స్, స్కిన్ షో తప్పనిసరి అని భావిస్తారు. కానీ ఈ భావనను ధిక్కరించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి సాయిపల్లవి (Sai Pallavi). సాదాసీదా లుక్, సహజమైన నటన, డ్యాన్స్‌లో అద్భుత ప్రతిభతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది.

మొదట వైద్య రంగం (Medical field) లో కెరీర్‌ను కొనసాగించిన ఆమె, తన డాక్టర్ డిగ్రీ పూర్తయ్యాక సినిమాల వైపు అడుగుపెట్టింది. చిన్నతనం నుంచే డ్యాన్స్‌పై ఆసక్తి కలిగిన సాయిపల్లవి, పలు డ్యాన్స్ షోలలో పాల్గొని తన ప్రతిభను చాటుకుంది. ముఖ్యంగా ఈటీవీ లో ప్రసారమైన “ఢీ” కార్యక్రమంలో ఆమె చేసిన ప్రదర్శన గుర్తుండిపోయేలా చేసింది.

భానుమతి పాత్ర

తన సినీ ప్రయాణం తమిళ సినిమా ప్రేమమ్ (మలయాళం అసలు వెర్షన్ తర్వాత రీమేక్‌లో కనిపించింది)తో మొదలైందని చాలామంది భావించినా, తెలుగులో మాత్రం ఫిదా (Fida Movie) ఆమెకు టర్నింగ్ పాయింట్ అయింది. ఈ సినిమాలో ఆమె చేసిన భానుమతి పాత్ర ప్రతి యువతిని ఆకట్టుకుంది. సహజంగా మాట్లాడే డైలాగులు, ఎలాంటి మేకప్ లేకుండా సింపుల్‌గా కనిపించడం ద్వారా చాలా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ప్రస్తుతం చాలా తక్కువ సినిమాలు చేసినా, సాయిపల్లవి టాలీవుడ్‌లో “లేడీ పవర్ స్టార్”గా పేరు సంపాదించుకుంది. కథకు ప్రాధాన్యత కలిగిన పాత్రలనే ఎంచుకోవడం, గ్లామర్ రోల్స్‌ను పూర్తిగా దూరం పెట్టడం వల్ల ఆమె ప్రత్యేకమైన స్థానం పొందింది. మిడిల్ క్లాస్ అబ్బాయి (MCA), పడిపడిలేచే మనసు, శ్యామ్ సింగ రాయ్ వంటి చిత్రాల్లో కూడా ఆమె నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి.

Sai Pallavi

జునైద్ ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రంలోనూ ఆమె నటిస్తోంది

ఇప్పుడు ఆమె దృష్టి బాలీవుడ్ (Bollywood) ప్రాజెక్టులపై ఉంది. రూ.4వేల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ‘రామాయణ’ ప్రాజెక్టులో నటిస్తోంది. రెండు భాగాలుగా తెరకెక్కే ఈ మూవీలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. దీంతో పాటు అమీర్‌ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ఏక్ దిన్’ చిత్రంలోనూ ఆమె నటిస్తోంది.సాయిపల్లవి తాజాగా ఓ కోలీవుడ్ సినిమాకి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వబోతుందన్న వార్త వినిపిస్తోంది.

కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ ‌(Kollywood director Vetrimaaran).. స్టార్ హీరో సూర్యతో ఓ సినిమా చేయాల్సి ఉండగా ఆ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది. అదే సినిమాని ఆయన శింబు (Simbu) తో చేస్తున్నాడు. దీనిపై ఇప్పటికే అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రాగా హీరోయిన్ కోసం సెర్చ్ చేస్తున్నారు. కోలీవుడ్‌లో వినిపిస్తోన్న టాక్ ప్రకారం ఈ మూవీలో హీరోయిన్‌గా సాయిపల్లవిని తీసుకోవాలని అనుకుంటున్నారట. హీరోయిన్ పాత్రకు అధిక ప్రాధాన్యత ఉండటంతో సాయిపల్లవి అయితే బాగుంటుందని వెట్రిమారన్ అనుకుంటున్నారట.

పాత్ర ఎంపికలో సాయిపల్లవ కఠినంగా ఉంటుందని

ముందుగా ఈ రోల్‌కి పూజా హెగ్దే (Pooja Hegde) ని అనుకున్నా చివరికి సాయిపల్లవి అయితేనే న్యాయం చేయగలదని ఫిక్స్ అయ్యారట. అయితే సాయిపల్లవి ఈ రోల్‌కి అంగీకరిస్తుందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. శింబు సినిమాలంటేనే హీరోయిన్లతో మితిమీరిన రొమాన్స్ ఉంటుంది.

పైగా హీరోయిన్లతో ఆయన అఫైర్లు, రూమర్స్ గురించి అందరికీ తెలిసిందే. అలాంటి హీరో పక్కన సాయిపల్లవి నటిస్తే ఆమె కెరీర్ రిస్క్‌లో పడినట్లేనని ఆమె ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే పాత్ర ఎంపికలో సాయిపల్లవి కఠినంగా ఉంటుందని.. తన ఇమేజ్‌కి చెడ్డపేరు తెచ్చే పాత్రలో నటించేంత అమాయకురాలు కాదని కొందరు చెబుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/sai-durga-tej-why-did-my-girlfriend-leave-me-sai-durga-tej/cinema/actor/546929/

Breaking News Kollywood casting news latest news Sai Pallavi heroine role Sai Pallavi new Kollywood movie Sai Pallavi with Simbu Simbu new film Telugu News Vetri Maaran direction

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.