📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

S. Saraswathi Movie Review: సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘సరస్వతి’ మెప్పించిందా?

Author Icon By Anusha
Updated: March 6, 2026 • 12:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

S. Saraswathi Movie Review: అచ్చమైన తెలుగు పేరుతో, విలక్షణ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ స్వీయ దర్శకత్వంలో నిర్మించి నటించిన చిత్రం ‘S. సరస్వతి’. ఈ సినిమా, నేడు (మార్చి 6) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఒక నటిగా ఇప్పటికే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి, దర్శకురాలిగా ఏ మేరకు సక్సెస్ అయిందో ఇప్పుడు చూద్దాం.

Read Also: With Love Movie: ఓటీటీలోకి వచ్చేసిన ‘విత్ లవ్’

కథ

నర్స్ ఉద్యోగం చేసే లక్ష్మీ (వరలక్ష్మీ శరత్ కుమార్) సింగిల్ పేరెంట్‌. తన కూతురు సరస్వతి (నివేష్కా నాయుడు) అంటే పంచ ప్రాణాలు. తానే జీవితంగా బతుకుతుంది. సరస్వతి 12వ పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకొంటారు. స్కూల్‌కు వెళ్లిన కూతురు అదృశ్యమైందని తెలుస్తుంది. ఆ తర్వాత ప్రిన్స్‌పల్ రూమ్‌లోనే ముగ్గురు చేతిలో మానభంగానికి గురైందనే విషయం తెలుస్తుంది. తల్లితో తన బాధను చెప్పి ప్రాణాలు విడుస్తుంది. ఆ షాక్‌లో ఎవరికీ చెప్పకుండా తన కూతురును శ్మశానికి తీసుకెళ్లి పూడ్చిపెడుతుంది. తన కూతురుకు, తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేకూర్చమని కోరితే ఎలాంటి సాక్ష్యాలు లేని కేసును ప్రముఖ లాయర్ (ప్రకాశ్ రాజ్) టేకప్ చేస్తారు.

S. Saraswathi Movie Review

సరస్వతి అంటే లక్ష్మీకి ఎంత ప్రేమ ఉంది? కూతురు కనిపించకుండా పోయిన తర్వాత లక్ష్మీ పరిస్థితి ఏమిటి? సరస్వతి మిస్సింగ్ తర్వాత స్కూల్ యాజమాన్యం ఇచ్చిన సమాధానం ఏమిటి? చనిపోయిన కూతురు బాడీని ఎవరికీ చెప్పకుండా లక్ష్మీ పూడ్చి పెట్టింది? ఈ కేసు విషయంలో పోలీసుల రెస్సాన్స్ ఏమిటి? సరస్వతి మానభంగం కేసును కోర్టు ఎందుకు డిస్మిస్ చేసింది? కోర్టు కేసును తిరస్కరించిన తర్వాత బయటకు వచ్చిన ఊహాకు అందని ట్విస్ట్ ఏమిటి? చివరకు సరస్వతి కేసులో లక్ష్మీకి న్యాయం జరిగిందా? అనే భావోద్వేగమైన ప్రశ్నలకు జవాబే సరస్వతి సినిమా కథ.

విశ్లేషణ

చిన్నపిల్లలపై జరిగే అఘాయిత్యాలు, లైంగిక వేధింపుల్ని కళ్లకి కడుతూ సోషల్‌ మెసేజ్‌ అందించే ప్రయత్నం చేసింది వరలక్ష్మీ శరత్ కుమార్. క్రైమ్ థ్రిల్లర్‌కి కోర్ట్ రూం డ్రామాని జతచేసి తల్లీ కూతుళ్ల సెంటిమెంట్‌ని హృద్యంగా చూపించింది. కనిపించకుండా పోయిన కూతురు కోసం ఓ తల్లి ఆవేదన, అన్వేషణతో ‘సరస్వతి’ కథ మొదలౌతుంది. సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుంచే ప్రేక్షకుల్ని కథలోకి తీసుకుని వెళ్లింది. తల్లీ, కూతుళ్ల మధ్య బాండింగ్.. వెంటనే కూతురు మిస్సింగ్.. సాక్ష్యాలు తారుమారు.. కోర్ట్ రూం డ్రామా ఇలా కథ ముందుకు వెళ్తున్న కొద్దీ ట్విస్ట్‌లు రివీల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Saraswathi Movie Review Varalaxmi Sarathkumar Director Varalaxmi Sarathkumar Saraswathi Rating

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.