📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Rukmini Vasanth: ‘టాక్సిక్’ నుంచి రుక్కు ఫస్ట్ లుక్ రిలీజ్

Author Icon By Anusha
Updated: January 6, 2026 • 3:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

‘సప్త సాగారాలు దాటి’తో పాపులరైన రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth).. ఇప్పటి వరకు కన్నడలో తప్ప మరో భాషలో హిట్ కొట్టలేదు. అయినా సరే మేకర్స్ ఆమెకు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు. కేవలం కన్నడ అనుకుంటే పొరపాటు.. టాలీవుడ్, కోలీవుడ్ కూడా ఆమెకు ఫిదా అయిపోయినట్లే కనిపిస్తోంది. రుక్కు స్క్రీన్ ప్రజెన్స్, ఇన్నోసెంట్ ఫేస్, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ఆడియన్స్ దిల్ దోచేస్తుండటంతో మేకర్స్ వరుసగా అవకాశాలు ఇస్తున్నారు.

Read also: Jana Nayagan: హైకోర్టు ను ఆశ్రయించిన విజయ్‌

రుక్మిణీ వసంత్ ప్రస్తుతం కన్నడలో ‘టాక్సిక్’ ఫిల్మ్ లో పవర్ ఫుల్ రోల్ చేస్తోంది.ఈ చిత్రం నుంచి రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో ఆమె ‘మెలిస్సా’ అనే పాత్రలో నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.ఈ సందర్భంగా దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ మాట్లాడుతూ.. “రుక్మిణిలోని తెలివైన నటి నాకు బాగా నచ్చుతుంది. ఆమె కేవలం నటించడమే కాదు, పాత్రను అర్థం చేసుకుని ముందుకు వెళుతుంది.

2026 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల

ఆమె అడిగే ప్రశ్నలు ఒక దర్శకురాలిగా నన్ను కూడా లోతుగా ఆలోచింపజేస్తాయి” అని ప్రశంసించారు. యశ్, గీతూ మోహన్‌దాస్ కలిసి రాసిన ఈ కథను కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు. తర్వాత తెలుగు, హిందీ, తమిళం, మలయాళంలో డబ్ చేసి విడుదల చేయనున్నారు.

View this post on Instagram

A post shared by Yash (@thenameisyash)

కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై వెంకట్ కె. నారాయణ, యశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ జేజే పెర్రీతో పాటు అన్బరివ్ యాక్షన్ సన్నివేశాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2026 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేక‌ర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

latest news Rukmini Vasanth first look Telugu News Toxic A Fairytale for Grown Ups Yash

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.