📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే

Latest News: Robo Shankar – నటుడు రోబో శంక‌ర్ మృతి.. నివాళులు అర్పించిన క‌మల్ హాస‌న్‌

Author Icon By Anusha
Updated: September 19, 2025 • 12:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కోలీవుడ్‌ చిత్రసీమ (Kollywood Cinema) లో ఒక పెద్ద విషాదం నెలకొంది. తన వినూత్న హాస్యప్రదర్శనలతో, ప్రత్యేక శైలితో ప్రేక్షకుల మనసులను దోచుకున్న ప్రముఖ హాస్యనటుడు రోబో శంకర్ఇకలేరు. 46 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూసిన వార్త తమిళ సినీప్రపంచానికే కాకుండా, దక్షిణాది ప్రేక్షకులను తీవ్రంగా కలిచివేసింది.

రోబో శంకర్ చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూగురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ వార్త బయటకు రాగానే ఆయన అభిమానులు, సినీప్రజలు, సహచరులు అందరూ తీవ్ర షాక్‌కు గురయ్యారు.

సూపర్‌హిట్ హాస్యనటుడిగా గుర్తింపు పొందారు

సినిమా రంగంలోకి వచ్చిన రోబో శంకర్ (Robo Shankar) తన ప్రత్యేకమైన హావభావాలు, శరీరభాష, టైమింగ్ సెన్స్‌తో కొద్దికాలంలోనే సూపర్‌హిట్ హాస్యనటుడిగా గుర్తింపు పొందారు. టెలివిజన్ కార్యక్రమాల ద్వారా తన ప్రతిభను చూపించుకున్న ఆయన, తరువాత సినిమాలలోనూ మంచి పాత్రలతో ముందుకు వచ్చారు.

కామెడీ (Comedy) కి కొత్త రూపం ఇచ్చిన ఈ నటుడు కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా, తన పాత్రలకు సజీవతను కూడా తీసుకువచ్చారు.రోబో శంక‌ర్ క‌మ‌ల్ హాస‌న్‌ (Kamal Haasan) కి వీరాభిమాని. అయితే త‌న అభిమాని చ‌నిపోయాడ‌న్న వార్త తెలుసుకున్న న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ సోష‌ల్ మీడియా వేదిక‌గా అత‌డికి నివాళులు అర్పించాడు.

నువ్వు మా నుంచి దూరంగా వెళ్ళిపోయావు

రోబో శంకర్.. నీ పేరులో ఉన్న రోబో ఒక ముద్దుపేరు మాత్ర‌మే. నువ్వు నా త‌మ్ముడివి. నువ్వు లేని లోటు మమ్మల్ని బాధపెడుతున్నా నువ్వు మా నుంచి దూరంగా వెళ్ళిపోయావు. నీ పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయావు, కానీ నా పని ఇంకా మిగిలి ఉంది.

రేపటిని మాకోసం వదిలి వెళ్ళిపోయావు. కాబట్టి రేపు మనదే అంటూ క‌మ‌ల్ రాసుకోచ్చాడు. ఇక రోబో శంక‌ర్ అంత్యక్రియలు శుక్రవారం చెన్నైలో జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య ప్రియాంక, కుమార్తె ఇంద్రజ ఉన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/ameesha-patel-ameesha-patel-reveals-the-reason-why-she-cant-get-married-yet/cinema/550189/

age 46 Breaking News Chennai Hospital comedian actor health issues kamal haasan tribute Kollywood latest news Passed Away robo shankar Tamil Film Industry Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.