Shivaji comments controversy: హీరోయిన్ల దుస్తులపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే గాయని చిన్మయి శ్రీపాద, మంచు లక్ష్మి, అనసూయ భరద్వాజ్ వంటి ప్రముఖులు తీవ్రంగా స్పందించగా, తాజాగా సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ(RGV) కూడా తనదైన శైలిలో ఘాటు కౌంటర్ ఇచ్చారు.
Read also: Shivaji Comments: హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్
దండోరా ఈవెంట్ వ్యాఖ్యలతో రేగిన వివాదం
‘దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా శివాజీ(Shivaji) మాట్లాడుతూ, నేటితరం హీరోయిన్లు సంప్రదాయ దుస్తులు ధరించాలని, పొట్టి బట్టలతో గ్లామర్ ప్రదర్శన చేయకూడదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన ఉపయోగించిన అభ్యంతరకర పదజాలం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు ఈ వ్యాఖ్యలను మహిళల స్వేచ్ఛపై దాడిగా అభివర్ణిస్తున్నారు.
ఈ వివాదంపై స్పందించిన దర్శకుడు రాంగోపాల్ వర్మ(RGV), మంచు లక్ష్మి తన సోదరుడు మంచు మనోజ్‌ను ప్రశంసిస్తూ చేసిన ట్వీట్‌ను రీపోస్ట్ చేస్తూ శివాజీ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. మహిళలపై నీతులు చెప్పే అర్హత ఎవరికీ లేదని, ఇతరుల వ్యక్తిగత అభిప్రాయాలు, ఎంపికలపై వ్యాఖ్యలు చేయడం సరికాదని వర్మ ఘాటుగా పేర్కొన్నారు. శివాజీ వ్యాఖ్యలను ఆయన తీవ్ర పదజాలంతో ఖండించారు.
ఈ ఘటనతో మరోసారి సినీ పరిశ్రమలో మహిళల స్వేచ్ఛ, గౌరవం, వ్యక్తిగత నిర్ణయాలపై చర్చలు మళ్లీ తెరపైకి వచ్చాయి. సోషల్ మీడియాలో ఈ అంశం పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తూ ఇంకా కొనసాగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: