RGV: ‘పెద్ది’ సినిమా నుంచి తాజాగా విడుదలైన ‘చికిరి చికిరి’ పాటపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram gopal varma) స్పందిస్తూ, రామ్ చరణ్ నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. చాలా కాలం తర్వాత చరణ్ తన అసలైన, సహజమైన రూపంలో కనిపించాడని వర్మ పేర్కొన్నారు. “సినిమా ప్రతి విభాగం హీరోను మెరుగుపరచడానికే ఉంటుంది. చరణ్ ఈ పాటలో చూపించిన ఆవేశం, ఎనర్జీ, సహజత్వం అద్భుతం. ఇది ఆయన కెరీర్‌లోనే ఒక అత్యుత్తమ ప్రదర్శన” అని ఆయన సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానించారు.
Read also: Bhartha Mahasayulaku Wignyapthi: RT76 టైటిల్ గ్లింప్స్ విడుదల
బుచ్చిబాబుపైనా ఆర్జీవీ ప్రశంసలు
RGV: అలాగే దర్శకుడు బుచ్చిబాబుపైనా ఆర్జీవీ ప్రశంసలు కురిపించారు. “ఒక స్టార్ తన చుట్టూ ఉన్న తళుకుబెళుకుల మధ్య కాదు, సహజత్వంలోనే ప్రకాశిస్తాడు. నువ్వు ఆ అంశాన్ని అద్భుతంగా చూపించావు. పెద్ద సెట్స్ లేకుండా, హీరోపై ఫోకస్ ఉంచి మేజిక్ సృష్టించావు” అని ఆయన చెప్పారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ పాట విడుదలైన గంటల్లోనే లక్షల వ్యూస్‌తో ట్రెండింగ్‌లోకి చేరింది. రామ్ చరణ్ పాన్-ఇండియా ఇమేజ్‌ను మరింత బలపరుస్తూ, ‘పెద్ది’పై అంచనాలను ఈ వ్యాఖ్యలు మరింత పెంచేశాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: