Renu Desai: రేణు దేశాయ్ వేధింపుల కేసులో ఇద్దరు ట్రోలర్లు అరెస్ట్

Read Time:  1 min
Renu Desai: రేణు దేశాయ్ వేధింపుల కేసులో ఇద్దరు ట్రోలర్లు అరెస్ట్
FONT SIZE
GET APP
Renu Desai: రేణు దేశాయ్ వేధింపుల కేసులో ఇద్దరు ట్రోలర్లు అరెస్ట్
Renu Desai: Two Trollers Arrested in Harassment Case

Renu Desai: ప్రముఖ నటి రేణు దేశాయ్ తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసభ్యకర ప్రచారంపై చేసిన ఫిర్యాదుపై సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని విమర్శలు, అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను కించపరిచేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

Read Also: Khushbu Sundar: త్రిష రూమర్స్‌పై ఖుష్బూ ఘాటు స్పందన

గత కొంతకాలంగా తనపై సోషల్ మీడియాలో నిరంతరాయంగా వేధింపులు జరుగుతున్నాయని రేణు దేశాయ్ పోలీసులను ఆశ్రయించారు. ప్రధానంగా నాలుగు వేర్వేరు అకౌంట్ల ద్వారా తనను టార్గెట్ చేస్తూ పోస్ట్‌లు పెడుతున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం, సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. ఇదివరకు యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ఫిర్యాదు మేరకు కూడా పోలీసులు ఒకరిని అరెస్ట్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా అధికారులు గుర్తు చేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో ఇతరుల ప్రైవసీని దెబ్బతీసి, అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.