రేణు దేశాయ్, పవన్ బద్రి, జానీ చిత్రాల్లో జంటగా నటించారు. 2009లో వీరిద్దరు వివాహం చేసుకోగా, వీరికి అకీరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. అయితే ఇద్దరి మధ్య రిలేషన్‌లో మనస్పర్థలు రావడంతో 2012లో విడాకులు తీసుకున్నారు. పవన్ తో విడాకుల తర్వాత ఒంటరి గానే ఉంటున్న ఆమె రెండేళ్ల క్రితమే టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. రవితేజ టైగర్ నాగేశ్వరరావు మూవీలో కీలక పాత్రలో నటించింది. అయితే ప్రస్తుతం సినిమాలు ఏం చేయకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటోంది. పలు అంశాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
అకీరా నందన్ వెండితెర ఎంట్రీ
అప్పట్లో తాను ఎవరినో పెళ్లి చేసుకుంటుందని, ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయిందని వార్తలు వచ్చాయి. కాని రేణూ మాత్రం ఇప్పటికీ సింగిల్‌గానే ఉంది. తాజాగా తన రిలేషన్ గురించి మాట్లాడుతూ అప్పట్లో నేను అరేంజ్డ్ నిశ్చితార్థం చేసుకోవాలి, వేరే రిలేషన్ షిప్‌లోకి వెళ్లాలి అని అనుకున్నాను. అయితే పెళ్లి చేసుకుంటే పిల్లలకి సరైన న్యాయం చేయలేనేమో అని ఆగాను. ఇప్పుడు పిల్లలు ఎదుగుతున్నారు. నేను వేరే జీవితం మొదలు పెడితే వారికి పూర్తి సమయం కేటాయించలేను. అందుకే వేరే రిలేషన్‌లోకి వెళ్లలేదు.ఆద్యకి 18 ఏళ్ళు దాటాక తనంతట తాను అన్ని పనులు చేసుకునే స్థాయికి వచ్చాక, తాను బిజీ అయ్యాక పెళ్లి గురించి ఆలోచిస్తానంటూ రేణూ కామెంట్ చేసింది.అకీరా నందన్ వెండితెర ఎంట్రీ గురించి కూడా రేణూ దేశాయ్ మాట్లాడింది. అకిరాని రామ్ చరణ్ లాంచ్ చేస్తున్నాడని వస్తున్న వార్తలు అవాస్తవం. నాకు కూడా అలాంటి చాలా ఆర్టికల్స్ వస్తాయి. అవి అకిరాకి పంపుతాను. నాకెందుకు పంపుతావు ఇలాంటివి అని ఇద్దరం నవ్వుకుంటాం. ఓజీ సినిమాలో అకిరా నటించట్లేదు. అకిరా యాక్టింగ్ చేస్తే నేనే అధికారికంగా చెప్తాను. అతనికి యాక్టింగ్ ఆలోచన వచ్చినా నేనే చెప్తాను. అప్పటిదాకా మీ వ్యూస్ కోసం అకిరా గురించి అలాంటి తప్పుడు థంబ్ నెయిల్స్ ఆపండి.కొంతమంది అకీరాని తిడుతున్నారు. అకిరా వస్తే హీరో కొడుకు, నెపోటిజం అని అంటున్నారు. నేను అయితే ఇదే చేయాలని ఏమి చెప్పలేదు. తనకి ఏం నచ్చితే అదే చేయమని చెప్పాను అని స్పష్టం చేసింది.
ప్రజలకు సేవ
తన రాజకీయ అరంగేట్రం గురించి చెప్తూ ఒకవేళ తాను ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే తప్పకుండా ప్రకటిస్తానని దానిని రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అంతే కాకుండా తాను రాజకీయాల్లో సరిపోనని భావిస్తున్నానని రేణు దేశాయ్ అన్నారు. గతంలో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం వచ్చినా పిల్లల కోసం దాన్ని వదులుకున్నానని చెప్పారు. ప్రజలకు సేవ చేయడంలో తనకు సంతోషం కలుగుతుందని వ్యాఖ్యానించారు.
Read Also: Puri Jagannadh : పూరి జగన్నాథ్ సినిమా కోసం టబు గ్రీన్ సిగ్నల్…