Renu Desai: కొద్ది రోజులుగా తాను సన్యాసం స్వీకరించబోతున్నట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలపై నటి రేణు దేశాయ్ (Renu desai) స్పందించారు. తాను చెప్పిన మాటలను తప్పుగా అర్థం చేసుకుని ప్రచారం చేస్తున్నారని, అది కేవలం సరదాగా అన్న వ్యాఖ్య మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు. ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన “భవిష్యత్ ప్లాన్ ఏమిటి?” అన్న ప్రశ్నకు తాను నవ్వుతూ “సన్యాసం తీసుకుంటా” అని చెప్పానని వివరించారు. అయితే, ఆ జోక్‌ను కొన్ని మీడియా సంస్థలు తీవ్రంగా తీసుకుని వార్తలుగా మార్చడం పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. “నేను బాధ్యతారహిత తల్లి కాదు. నా పిల్లలు ఇంకా చిన్నవాళ్లు. వాళ్ల భవిష్యత్తు నా చేతుల్లో ఉంది. వారిని వదిలేసి సన్యాసం తీసుకునే ఆలోచన నాకు లేదు,” అని రేణు స్పష్టం చేశారు.
Read aslo: Ram Charan:పెద్ద కొండల్లో కష్టపడి ‘పెద్ది’ సినిమా షూటింగ్
Renu Desai: నేను బాధ్యత లేని తల్లిని కాదు: రేణు దేశాయ్
తనకు ఆధ్యాత్మికత అంటే ఆసక్తి ఉన్నప్పటికీ, పిల్లల బాధ్యత ముందుగా అని తెలిపారు. “ఇలాంటి విషయాలను నేను 65 ఏళ్లు దాటిన తర్వాత ఆలోచిస్తాను గానీ, ఇప్పుడే కాదు,” అంటూ నవ్వుతూ చెప్పారు. అలాగే, మీడియాలో ఇలాంటి చిన్న విషయాలను పెద్దగా చూపించడం కంటే, సమాజంలో ఉన్న నిజమైన సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. తెలుగు ప్రేక్షకులకు ‘బద్రి’ సినిమాతో పరిచయమైన రేణు దేశాయ్, (Renu Desai) ఇటీవల ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంతో మళ్లీ నటనలోకి అడుగుపెట్టారు. నటనతో పాటు ఆమె సామాజిక సేవ, జంతు సంరక్షణ వంటి అంశాలపై సోషల్ మీడియాలో తరచుగా స్పందిస్తుంటారు.
రేణు దేశాయ్ సన్యాసం తీసుకోబోతున్నారని వచ్చిన వార్తలు నిజమేనా?
కాదు, ఆ వార్తలు పూర్తిగా పుకార్లే. ఓ ఇంటర్వ్యూలో సరదాగా అన్న మాటను మీడియా తప్పుగా అర్థం చేసుకుంది అని ఆమె చెప్పారు.
ఆమె ఎందుకు సన్యాసం గురించి ప్రస్తావించారు?
యాంకర్ అడిగిన “భవిష్యత్ ప్లాన్ ఏమిటి?” అన్న ప్రశ్నకు సరదాగా “సన్యాసం తీసుకుంటా” అని సమాధానమిచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: