బాలీవుడ్ నటి రియా చక్రవర్తికి బాంబే హైకోర్టు (Bombay High Court) కీలక ఉపశమనం కల్పించింది. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) మృతితో సంబంధం ఉన్న కేసులో ఆమెపై గతంలో విధించిన కొన్ని కఠినమైన షరతులను న్యాయస్థానం సడలించింది.
GV Prakash: జీవీ ప్రకాశ్-సైంధవి జంటకు అధికారికంగా విడాకులు
ముఖ్యంగా, రియా (Rhea Chakraborty) కు సంబంధించిన పాస్‌పోర్ట్‌ను తిరిగి ఇవ్వాలని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ)కి ఆదేశాలు జారీ చేసింది.సుశాంత్ మృతి కేసులో గతంలో అరెస్ట్ అయిన రియా చక్రవర్తి నెల రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు.
విదేశాల్లో వచ్చే పలు అవకాశాలను కోల్పోతున్నానని
అయితే, తన పాస్‌పోర్ట్‌ను ఎన్‌సీబీ (NCB) కి అప్పగించాలనే షరతును ఆమెపై విధించారు. ఈ షరతు కారణంగా తాను విదేశాల్లో వచ్చే పలు అవకాశాలను కోల్పోతున్నానని, కాబట్టి దానిని తొలగించాలని రియా తన న్యాయవాది అయాజ్ ఖాన్ ద్వారా కోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు.ఈ అభ్యర్థనను ఎన్‌సీబీ తరఫు న్యాయవాది ఎస్‌కే హల్వాసియా తీవ్రంగా వ్యతిరేకించారు.
రియాను కూడా సాధారణ పౌరురాలిగానే చూడాలని, కేవలం ఆమె సెలబ్రిటీ అయినంత మాత్రాన నిబంధనలలో ప్రత్యేక మినహాయింపులు ఇవ్వకూడదని వాదించారు.ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ గోఖలే.. రియాకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. “విచారణ ముగింపునకు ఆమె అందుబాటులో ఉండరని సందేహించడానికి ఎలాంటి కారణం లేదు” అని న్యాయమూర్తి (Judge) స్పష్టం చేశారు.
విచారణ ప్రక్రియకు ఆమె పూర్తిగా సహకరిస్తున్నారని
విచారణ ప్రక్రియకు ఆమె పూర్తిగా సహకరిస్తున్నారని, గతంలో అనుమతితో విదేశాలకు వెళ్లి సకాలంలో తిరిగి వచ్చారని కోర్టు గుర్తుచేసింది. ఇదే కేసులోని ఇతర నిందితులకు కూడా ఇలాంటి ఊరట లభించిందని ధర్మాసనం పేర్కొంది.2020 జూన్‌లో నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని తన నివాసంలో మరణించిన సంగతి తెలిసిందే.
ఈ కేసుపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరిగింది. మొదట ప్రమాదవశాత్తు మరణంగా నమోదైన ఈ కేసును, ఆ తర్వాత సీబీఐ దర్యాప్తు చేపట్టింది. సుదీర్ఘ విచారణ అనంతరం, సుశాంత్ మృతిలో రియా చక్రవర్తి ప్రమేయం లేదని సీబీఐ తేల్చి, ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: