ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ చిత్రంలోని తొలి పాట ‘రెబల్ సాబ్’(Rebel Saab Song)ను హైదరాబాద్‌లోని విమల్ థియేటర్‌లో అభిమానుల హర్షాతిరేక నడుమ విడుదల చేశారు. తమన్ రూపొందించిన ఈ ఎనర్జిటిక్ మాస్ సాంగ్‌లో ప్రభాస్ స్టైల్, డ్యాన్స్ మూవ్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. పాట రిలీజ్‌తోనే సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఈవెంట్ సందర్భంగా థియేటర్ బయట నుంచి లోపల వరకూ అభిమానుల సందడి కనిపించింది. బిగ్ స్క్రీన్‌పై పాట మొదలయ్యడంతో ప్రభాస్(Prabhas) అభిమానులు ఫ్లాగ్లు ఊపుతూ, నినాదాలు చేస్తూ వేడుకలా మార్చేశారు. చాలా కాలం తర్వాత ప్రభాస్ మాస్ డ్యాన్స్ స్టెప్స్ చేయడం అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు చేసింది.
Read Also: Smriti Mandhana: స్మృతి మంధాన కాబోయే భర్తకూ అనారోగ్యం!
ఈ కార్యక్రమానికి దర్శకుడు మారుతి, నిర్మాతలు టీ.జీ. విశ్వప్రసాద్, వివేక్ కుచిబొట్ల, ఇషాన్ సక్సేనా, సినిమాటోగ్రాఫర్ తదితరులు హాజరయ్యారు. తమన్ మాట్లాడుతూ, ఈ పాటను ప్రత్యేకంగా ప్రభాస్ కోసం రూపొందించినట్టు చెప్పారు. “ప్రభాస్ గారి స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్‌కు తగ్గట్టు మాస్ వైబ్‌తో పాటు, ‘ది రాజా సాబ్’(Rebel Saab Song) కథలోని రాజసాన్ని కలపాలని భావించాం. ఈ పాట ఆయన అభిమానులకు చిరస్థాయిగా గుర్తుండేలా ఉంటుంది” అని తమన్ చెప్పారు.
ప్రభాస్ డ్యాన్స్, ఎక్స్‌ప్రెషన్స్, విజువల్స్
పాటలో ప్రభాస్ పాత సినిమాల ఫొటోలు కూడా చూపించడంతో అనేక మంది ఫ్యాన్స్‌కి నాస్టాల్జిక్ ఫీలింగ్ ఇచ్చింది. ప్రభాస్ డ్యాన్స్, ఎక్స్‌ప్రెషన్స్, విజువల్స్ ఈ సాంగ్‌ను మరింత ప్రత్యేకంగా మార్చాయి. సింగిల్ రిలీజ్ అయిన వెంటనే సోషల్ మీడియా(socail media)లో భారీ స్పందన వస్తోంది. యూట్యూబ్‌లో కొన్ని గంటల్లోనే లక్షల వ్యూస్ దాటడంతో, ఇది ప్రభాస్‌కి మరో భారీ హిట్ అవుతుందనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది.
మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవై ఎంటర్టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రభాస్‌తో పాటు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, సంజయ్ దత్, బోమన్ ఇరానీ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ‘ది రాజా సాబ్’ హారర్–మాస్ ఎంటర్టైనర్‌గా జనవరి 9న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. కొత్త సంవత్సరానికి ప్రభాస్ అభిమానులకు ఇది ప్రత్యేక కానుకగా నిలవనుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: