📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Rajasekhar: ఏ పాత్ర అయినా చేయడానికి సిద్ధం: రాజశేఖర్

Author Icon By Aanusha
Updated: November 2, 2025 • 9:52 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సీనియర్‌ నటుడు రాజశేఖర్ (Rajasekhar) తన సినీ ప్రయాణంలో దాదాపు వంద చిత్రాలను పూర్తి చేసినట్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ, ఇకపై ఎలాంటి పాత్ర వచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఇటీవల హీరో శర్వానంద్ నటించిన ‘బైకర్‌’ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ లాంచ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న రాజశేఖర్‌ తన కెరీర్‌ గురించి పంచుకున్నారు.

Read Also: Tabitha: సుకుమార్ భార్య తబిత నిర్మాతగా రంగప్రవేశం

రాజశేఖర్ (Rajasekhar) మాట్లాడుతూ, “నాకు ఖాళీగా ఉండటం అస్సలు నచ్చదు. నేను పని చేయకుండా ఉంటే, జైలులో ఉన్నట్లుగా అనిపిస్తుంది” అని తెలిపారు. తన జీవితంలో నటన అంటే ఎంత ప్రాధాన్యమో ఆయన మాటల్లో స్పష్టమైంది. ఆయన సినీ ప్రయాణం నలభై ఏళ్లకు పైగా కొనసాగుతూ, యాక్షన్‌ హీరోగా, కుటుంబ కథా చిత్రాల్లో సున్నితమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Rajasekhar

“గతంలో ఓ సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లినప్పుడు, అక్కడి ఫొటోగ్రాఫర్ ఒకరు ‘మీ చేతి నిండా పని ఉంది, మీరు చాలా లక్కీ’ అన్నారు. ఆ రోజు ఆ మాటకు పెద్దగా అర్ధం కాలేదు. కానీ ఇప్పుడు దాని ప్రాముఖ్యత అర్థమవుతోంది. కరోనా సమయంలో నేను నడవలేని పరిస్థితికి వెళ్లాను. రెండు, మూడు నెలల్లో కోలుకున్నా, పని చేయాలనే తపన మాత్రం తగ్గలేదు,” అని వివరించారు.”చాలా కథలు విన్నాను, కానీ ఏవీ నచ్చలేదు.

ఓ నటుడిగా ప్రతిరోజూ సెట్ నుంచి ఎంతో సంతృప్తి

ఆ నిరాశలో ఉన్నప్పుడు దర్శకుడు అభిలాష్ ‘బైకర్‌’ కథతో నా దగ్గరకు వచ్చారు. ఈ స్క్రిప్ట్ నాకు ఎంతగానో నచ్చింది. ఓ నటుడిగా ప్రతిరోజూ సెట్ నుంచి ఎంతో సంతృప్తితో ఇంటికి వెళ్లేవాడిని,” అని పేర్కొన్నారు. ఈ సినిమా గ్లింప్స్ ముందే చూసి ఉంటే, తానే హీరో పాత్రను అడిగేవాడినంటూ ఆయన సరదాగా వ్యాఖ్యానించారు.

ఇదే వేడుకలో తాను చాలాకాలంగా ఇరిటబుల్‌ బవల్‌ సిండ్రోమ్‌ (ఐబీఎస్‌)తో బాధపడుతున్నానని రాజశేఖర్ వెల్లడించారు. అందుకే వేదికపై మాట్లాడటానికి మొదట కాస్త ఇబ్బంది పడ్డానని అన్నారు.కాగా, అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో మాళవికా నాయర్‌ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రం డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

latest news Rajasekhar Telugu Actor Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.