📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’

Ravi Basrur Emotional Story: కల్ట్ టీజర్ లాంచ్.. కన్నీళ్లు పెట్టుకున్న రవి బస్రూర్

Author Icon By Anusha
Updated: February 22, 2026 • 11:00 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Ravi Basrur Emotional Story: సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన రవి బస్రూర్, తన విజయాల వెనుక ఉన్న చీకటి రోజులను గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ లో జరిగిన ‘కల్ట్’ (CULT) టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ, తన 18 ఏళ్ల వయసులో ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, మానసిక సంఘర్షణల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న విషయాలు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించాయి.”నాకు 18 ఏళ్ల వయసున్నప్పుడు రెండుసార్లు చనిపోదాం అనుకున్నాను. ఈ లైఫ్ వద్దని, భూమ్మీద ఉండకూడదని రెండుసార్లు సూసైడ్ చేసుకోడానికి ప్రయత్నించా.

Read Also: Cult Teaser Release: ‘కల్ట్’ టీజర్‌ చూసారా?

నన్ను రవి బస్రూర్‌ అని పిలుస్తారు కదా

రెండోసారి నన్ను ఒక వ్యక్తి కాపాడారు. నాకు అవసరమైన కీబోర్డు కొనుక్కోవడానికి 35 వేల రూపాయలు ఇచ్చాడు. ఆ వ్యక్తి పేరు రవి. అప్పటి నుంచి నా పేరు రవి బస్రుర్ అని మార్చుకున్నా. నేను చనిపోయే వరకూ, నా ఆఖరి ఊపిరి ఉన్నంతవరకూ మీరందరూ నన్ను రవి బస్రూర్‌ అని పిలుస్తారు కదా! ఆ క్రెడిట్‌ ఆయనకు దక్కుతుంది. ఇప్పుడు విశ్వక్‌ సేన్ కు నేను థ్యాంక్స్‌ చెబుతున్నా.

Ravi Basrur Emotional Story: Cult teaser launch.. Ravi Basrur in tears

ఇతను నన్ను గుర్తించాడు. ఈ ఇద్దరిని నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను. ఎందుకంటే విశ్వక్ నా జర్నీని, నా సోల్ ని గుర్తించాడు. విశ్వక్ కోసం లైఫ్ టైమ్ ఉంటా. ‘కల్ట్’ మామూలుగా ఉండదు” అని రవి బస్రూర్‌ చెప్పుకొచ్చారు. రవి బస్రుర్ కి హైదరాబాద్ లో కూడా ఇళ్లు ఉందని, అది తన ఇల్లే అని ఈ సందర్భంగా విశ్వక్ అన్నారు.25 ఏళ్ల కెరీర్‌లో అందరూ తన లోపల మ్యూజిక్‌ను టాలెంట్ ను మాత్రమే చూశారని, కానీ మొదటిసారి తన ఆత్మను చూసిన వ్యక్తి విశ్వక్ సేన్ అని రవి బస్రూర్ భావోద్వేగంగా మాట్లాడారు. ఇది సంగీత దర్శకులకు దక్కిన గౌరవమని సంతోషం వ్యక్తం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Cult Movie Teaser Launch Ravi Basrur Emotional Story Vishwak Sen Ravi Basrur Rolex Watch

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.