మలయాళ సినీ పరిశ్రమలో ప్రతి సంవత్సరం కొత్త తరహా కథలు, విభిన్నమైన కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. ఆ క్రమంలో తాజాగా ఒక కామెడీ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ నటుడు అనూప్ మీనన్ ప్రధాన పాత్రలో నటించిన రవీంద్ర నీ ఎవిడే? ఈ చిత్రానికి మనోజ్ పలోదన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూలై 18న కేరళలో థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో డిజిటల్ ప్రేక్షకులను అలరిస్తోంది.మరి ఈ మూవీ ఎలా ఉందొ రివ్యూ లో తెలుసుకుందాం.
కథ
రవీంద్ర (అనూప్ మీనన్) వాతావరణ శాఖలో కీలకమైన బాధ్యతలను నిర్వహిస్తూ ఉంటాడు. భార్య బిందు (షీలు అబ్రహం) పదేళ్ల కూతురు .. ఇదే అతని కుటుంబం. పెళ్లినాటి గొడవల కారణంగా అత్తవారింటికి వెళ్లడానికి అతను ఎంతమాత్రం ఇష్టపడడు. ఇక తన ఎమోషన్స్ ను అతను స్నేహితుడైన బాలుతో మాత్రమే పంచుకుంటూ ఉంటాడు. బాలు తన భార్య నుంచి విడాకులు తీసుకునే పనులతో బిజీగా ఉంటాడు. తన భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడమే అందుకు కారణమని అతను రవీంద్రతో చెబుతాడు.
ఇక రవీంద్ర ఆఫీస్ నుంచి అపార్టుమెంటుకు రాగానే, అతని ఫ్లాట్ కి అప్పుడప్పుడు ఎవరో వచ్చి వెళుతున్నట్టుగా సెక్యూరిటీ వాళ్లు చెబుతూ ఉంటారు. బిందును అడిగితే ఎవరూ రాలేదని అంటూ ఉంటుంది. దాంతో అతను ఆమెకి తెలియకుండా అపార్ట్ మెంటుకి సంబంధించిన సీసీటీవీ పుటేజ్ ను పరిశీలిస్తాడు. ఎవరో ఒక యువకుడు తన ఫ్లాట్ వైపు వెళ్లడం అతనికి కనిపిస్తుంది. ఆ యువకుడి మెడపై ఒక టాటూ ఉండటం గమనిస్తాడు. అప్పటి నుంచి అతనికి తన భార్యపై అనుమానం మొదలవుతుంది.
కథనం
ఇందు’ విషయంలో ఒక క్లారిటీకి రావాల్సిన అవసరం ఉందని అతను భావిస్తాడు. అప్పటి వరకూ తాను ప్రశాంతంగా డ్యూటీ చేయలేననే నిర్ణయానికి వస్తాడు. తాను ఒక ముఖ్యమైన పనిపై ‘తిరువనంతపురం’ వెళుతున్నానని బిందుకి అబద్ధం చెబుతాడు. ఆమెకి తెలియకుండా, ఎప్పుడూ క్లోజ్ చేసి ఉండే స్టోర్ రూమ్ లో దాక్కుంటాడు. అప్పుడు ఏం జరుగుతుంది? అతనికి తెలిసే విషయమేమిటి? ఇందు దొరికిపోతుందా? అనేది కథ.
మలయాళంలో ‘రవీంద్ర నీ ఎవిడే’ (Raveendra Nee Evide) అంటే ‘రవీంద్ర నువ్వు ఎక్కడ’ అని అర్థం. టైటిల్ కి తగిన కథ ఇది.ఎంతగా ప్రేమించి పెళ్లి చేసుకున్నా, అనుమానాలు .. అపార్థాలు చోటు చేసుకోవడం సహజంగా జరిగిపోతూ ఉంటాయి. తన భార్యకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్నానే ఒక నమ్మకం చాలామందికి ఉంటుంది. అయితే అలాంటి భర్తలకు అనుమానం కలగడానికీ .. అది బలపడుతూ వెళ్లడానికి ఒక చిన్నపాటి కారణం సరిపోతుంది. ఆ చిన్న విషయంపైనే దర్శకుడు ఈ కథను అల్లుకుంటూ వెళ్లాడు.
పరిమితమైన పాత్రలతోనే
సాధారణంగా మలయాళం (Malayalam) లో పరిమితమైన పాత్రలతోనే పట్టుగా కథను నడిపిస్తూ ఉంటారు. ఈ సినిమా విషయంలోను అదే పద్ధతిని ఫాలో కావడం కనిపిస్తూ ఉంటుంది. రెండు .. మూడు లొకేషన్స్ లో, నాలుగైదు ప్రధానమైన పాత్రల చుట్టూనే ఈ కథ తిరుగుతుంది. కథ నిదానంగా నడుస్తూ .. చివరికి వచ్చేసరికి ఆడియన్స్ ను టెన్షన్ పెడుతుంది. ప్రీ క్లైమాక్స్ లో ఇచ్చే ట్విస్ట్ తో, కథ మరింత పుంజుకుని ఆసక్తిని రేకెత్తిస్తుంది.
కథను .. పాత్రలను అక్కడక్కడే తిప్పుతూ ప్రేక్షకులను కూర్చోబెట్టిన తీరు బాగుంది. చాలా చిన్న సమస్య అనుకున్నది ఒక్కోసారి ఎలా పెద్దది అవుతుంది? బయటపడలేనంత పరిస్థితులను ఎలా సృష్టిస్తుంది? అనేది దర్శకుడు చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. సహజత్వానికి దగ్గరగా సాగే ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.
Read hindi news:hindi.vaartha.com
Read Also: