📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Rashmika: నా ఫ్యామిలీ ని చాలా మిస్ అవుతున్నా

Author Icon By Anusha
Updated: July 7, 2025 • 2:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నేషనల్ క్రష్‌గా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రష్మిక మందన్న, నేషనల్ క్రష్ రష్మిక జర్నీ ఎలా మొదలైంది? ఎక్కడ మొదలైందో అందరికీ తెలిసిందే. కూర్గ్ ప్రాంతానికి చెందిన ఈ రష్మిక కన్నడలో కిరిక్ పార్టీతో సిల్వర్ స్క్రీన్ మీదకు వచ్చింది. రక్షిత్ శెట్టి హీరోగా రిషభ్ శెట్టి తీసిన ఈ చిత్రంతో రష్మికకి స్టార్డం వచ్చింది. అయితే తెలుగులో ఛలో అంటూ బ్లాక్ బస్టర్ హిట్ అయిన తరువాత కన్నడ పరిశ్రమకు దూరంగానే ఉంటూ వచ్చారు. కిరిక్ పార్టీ టైంలో రక్షిత్ శెట్టితో మొదలైన ప్రేమ, జరిగిన ఎంగేజ్మెంట్‌ను రష్మిక (Rashmika) క్యాన్సిల్ చేసుకుని తెలుగు, తమిళ, హిందీ సినిమాలు అంటూ ఫుల్ బిజీగా మారిపోయారు.ఇప్పుడు రష్మిక అంటే నేషనల్ లక్కీ స్టార్. పుష్ప, పుష్ప 2, యానిమల్, ఛావా, కుబేర అంటూ ఇలా వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నారు. క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు.

తనకు దాదాపు

చెన్నై, ముంబై, హైదరాబాద్ అంటూ ఇలా రోజూ అటూ ఇటూ తిరుగుతూ షూటింగ్‌లు చేస్తూనే ఉన్నారు. రష్మిక తన ఇంటికి వెళ్లి, ఫ్యామిలీతో సమయం గడిపి చాలా రోజులే అవుతోందట. దాదాపు ఏడాదిన్నర పాటుగా ఇంటికి వెళ్లకుండానే ఉన్నారట.ఇక రష్మికకి ఓ చిట్టి చెల్లి ఉందన్న సంగతి తెలిసిందే. తన చెల్లి కి, తనకు దాదాపు 16 ఏళ్ల గ్యాప్ ఉంటుందట. ఇప్పుడు తన చెల్లికి 13 ఏళ్లు ఉంటాయి. ఆమెను మాత్రం చాలా మిస్ అవుతోందట. సినిమాల్లో (Movies) కి రాకముందు తన ఫ్రెండ్స్, ఫ్యామిలీ, చెల్లితో ఎక్కువగా టైం గడిపేవారట. కానీ ఇప్పుడు అసలు వాళ్లతో మాట్లాడేంత టైం కూడా ఉండటం లేదని అంటోన్నారు.

Rashmika: నా ఫ్యామిలీ ని చాలా మిస్ అవుతున్నా

త్యాగాలు చేయాల్సి

ఒకప్పుడు తాను లేకుండా ఫ్రెండ్స్ గానీ ఫ్యామిలీ గాని వెకేషన్‌లకు వెళ్లే వారు కాదట. కానీ ఇప్పుడు తనకు చెప్పడం, తను అడగటం కూడా వదిలేశారట. ఎలాగూ బిజీగా ఉంటుంది. రాదు కదా? అని తనను లైట్ తీసుకున్నారట. ఒకటి కావాలనుకుంటే ఇంకోటి వదిలేయాల్సి వస్తుందని, పర్సనల్ లైఫ్ కావాలని అనుకుంటే. ప్రొఫెషనల్ లైఫ్‌ (Professional life) ను త్యాగం చేయాల్సి వస్తుందని, ప్రొఫెషనల్ లైఫ్ కావాలని అనుకుంటే, పర్సనల్ లైఫ్‌లో కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుందని అమ్మ ఎప్పుడో చెప్పిందట. కానీ తాను మాత్రం రెండింటినీ బ్యాలెన్స్ చేయాలని రష్మిక భావిస్తున్నారట .

Read hindi news: hindi.vaartha.com

Read Also: Kantara Chapter 1: రిషబ్ పుట్టిన రోజు సందర్బంగా ‘కాంతార చాప్టర్ 1’ కొత్త పోస్టర్ విడుదల


రష్మిక మందన్న వయస్సు ఎంత?

రష్మిక మందన్న వయస్సు 05 Apr 1996 నాటికి 29.

రష్మిక మందన్న మాతృ బాష ఏది?

రష్మిక మందన్న మాతృభాష కొడవ.

Breaking News CoorgControversy KannadaAudience latest news RashmikaMandanna RashmikaStatement Telugu News ViralInterview

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.