తెలుగు సినీ ఇండస్ట్రీలో టాలెంటెడ్ యాక్టర్ల గురించి మాట్లాడితే తప్పక చెప్పాల్సిన పేరు సత్యదేవ్. తన ప్రత్యేకమైన నటనతో, విభిన్న పాత్రల ఎంపికతో ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ హీరో, చాలా కష్టాలు పడుతూ స్టార్‌డమ్ దిశగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. చదువుకునే రోజుల్లోనే సినిమాలపై ఉన్న ప్యాషన్‌తో షార్ట్ ఫిల్మ్‌లను రూపొందించి, ఓ వైపు ఉద్యోగం చేస్తూనే సినీ అవకాశాల కోసం తహతహలాడిన సత్యదేవ్, చివరికి ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ సినిమాలో చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కెరీర్ మొదలు పెట్టాడు.సినిమా ఇండస్ట్రీలో కేవలం హీరోగా కాకుండా, విలన్‌గా, సపోర్టింగ్ రోల్స్‌లో కూడా తనదైన స్టైల్‌తో మెప్పించాడు. ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి చిత్రాలతో అతని నటన కొత్త స్థాయికి చేరింది. అయితే చాలా సినిమాల్లో తన టాలెంట్‌కి తగినంత గుర్తింపు రాలేదని చెప్పాలి. ఒకవేళ సరైన పాత్ర దొరికితే వెండితెరపై సత్యదేవ్ (Satyadev) ఏ స్థాయిలో నటించగలడో, ఇప్పటికే కొన్ని సినిమాలు నిరూపించాయి.
నిజమైన పాత్రలతో
ఇటీవల ‘కింగ్‌డమ్’ సినిమాలో విజయ్ దేవరకొండ అన్న పాత్రలో సత్యదేవ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. అలాగే తాజాగా విడుదలైన ‘అరేబియా కడలి’ వెబ్ సిరీస్ (‘Arabia Kadali’ web series) లో మరోసారి తన ప్రతిభను చూపించాడు. ప్రతి ప్రాజెక్ట్‌లో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేసే సత్యదేవ్, ఇప్పటికీ తన టాలెంట్‌కి తగ్గ బిగ్ బొమ్మ కోసం ఎదురుచూస్తున్నాడని చెప్పాలి.ప్రేక్షకులను తన సహజమైన కథనం, నిజమైన పాత్రలతో ఆకట్టుకున్న దర్శకుడు వెంకటేష్ మహా. ఆయన దర్శకత్వంలోనే సత్యదేవ్ నటించిన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇప్పుడు వీరిద్దరూ మళ్లీ కలిసి ‘రావు బహదూర్’ అనే చిత్రాన్ని చేస్తున్నారు. ఈ టైటిల్‌తోనే సినిమా పట్ల ఆసక్తి పెరిగింది. ఇటీవల విడుదలైన టైటిల్ పోస్టర్‌లో సత్యదేవ్ లుక్‌తో పాటు “అనుమానం పెనుభూతం” అనే ట్యాగ్ లైన్ మరింత సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది.తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ని దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సోమవారం విడుదల చేశారు. ‘నాకు అనుమానం అనే భూతం పట్టింది’ అంటూ ఆసక్తికరమై డైలాగ్‌తో టీజర్ స్టార్ట్ అవుతోంది.
టీజర్ విడుదల
అక్కడి నుంచి పలు విభిన్న గెటప్పుల్లో సత్యదేవ్ ఇరగదీశాడు. అసలు ఈ కథ ఆయన కోసమే పుట్టిందా అనిపించేలా ఉంది. ప్రతి గెటప్‌కి కరెక్ట్‌గా సూటయ్యాడు. టీజర్ చూస్తుంటే దీన్ని సైకలాజికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు అనిపిస్తోంది.ఈ టీజర్‌ని రిలీజ్ చేసిన రాజమౌళి ‘రావు బహదూర్’ టీమ్‌కి విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. ‘సత్యదేవ్ ఎప్పటిక్పపుడు ఎదుగుతూ అద్భుతమైన పాత్రలు పోషించడం చూస్తుంటే ఆనందంగా ఉంది. ‘రావు బహదూర్’ సినిమా కోసం ఆయనతో పాటు డైరెక్టర్ వెంకటేష్ మహాకు నా శుభాకాంక్షలు. ఈ సినిమా చూడటానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. జక్కన్న ట్వీట్‌కు స్పందించిన సత్యదేవ్… రాజమౌళి గారికి కృతజ్ఞతలు. తెలుగు సినిమా ఎంత దూరం వెళ్లగలదో మీరు చూపించారు. #RaoBahadur కోసం మీరిచ్చిన ఆశీర్వాదాలు మమ్మల్ని ఇంకా ఎత్తుకు చేరుకోవాలనే లక్ష్యంతో ముందుకు నడిపిస్తాయి’ అని రిప్లై ఇచ్చారు.
సత్యదేవ్ సినీ ప్రయాణం ఎలా మొదలైంది?
చదువుకునే రోజుల్లోనే సినిమాలపై ప్యాషన్‌తో షార్ట్ ఫిల్మ్ మేకర్‌గా మారాడు. తర్వాత ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీ ప్రయాణం ప్రారంభించాడు.
సత్యదేవ్ నటించిన ముఖ్యమైన సినిమాలు ఏవి?
కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, బ్లఫ్ మాస్టర్, బ్రోచేవారెవరురా, గాడ్‌సే, తిమ్మరుసు వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
Read more: hindi.vaartha.com
Read Also: