📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’

Ranveer Singh: 21 రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్‌లోకి ‘ధురంధర్’

Author Icon By Tejaswini Y
Updated: December 26, 2025 • 2:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బాలీవుడ్ అగ్ర హీరో రణ్‌వీర్ సింగ్(Ranveer Singh) ప్రధాన పాత్రలో నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. విడుదలైన కేవలం 21 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1,000 కోట్ల గ్రాస్ వసూళ్లను దాటి అరుదైన రికార్డు సాధించింది. క్రిస్మస్ రోజున (డిసెంబర్ 25) ఈ మైలురాయిని అందుకున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థలు జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ అధికారికంగా వెల్లడించాయి. ఈ ఘనతతో రూ.1000 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన 9వ భారతీయ చిత్రంగా ‘ధురంధర్’ నిలిచింది.

Read also: Dhurandhar Movie: బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’

Ranveer Singh: ‘Dhurandhar’ enters Rs 1000 crore club in 21 days

డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుంచే మంచి టాక్ తెచ్చుకుంది. వాణిజ్య వర్గాల లెక్కల ప్రకారం, 21వ రోజు నాటికి ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1006.7 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. భారత్‌లో రూ.668.80 కోట్ల నెట్ కలెక్షన్లు (రూ.789.18 కోట్ల గ్రాస్) సాధించగా, విదేశీ మార్కెట్ల నుంచి రూ.217.50 కోట్లు సమకూరాయి. ఈ విజయంతో 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ‘కాంతార: చాప్టర్ 1’ రికార్డును ‘ధురంధర్’ అధిగమించింది.

స్పెషల్ పోస్టర్ విడుదల

ఈ సందర్భంగా జియో స్టూడియోస్ ఓ స్పెషల్ పోస్టర్ విడుదల చేస్తూ, “రూ.1000 కోట్ల క్లబ్‌లో గర్వంగా అడుగుపెట్టాం… ‘ధురంధర్’ ప్రభంజనం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది” అని పేర్కొంది. ఈ ఘన విజయంపై చిత్ర పరిశ్రమ నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా దర్శకుడు ఆదిత్య ధర్‌ను అభినందిస్తూ సోషల్ మీడియాలో స్పందించారు.

అద్భుతమైన రెస్పాన్స్ నేపథ్యంలో, ఈ చిత్రానికి సీక్వెల్‌ను కూడా మేకర్స్ ప్రకటించారు. ‘ధురంధర్ పార్ట్ 2: ది రివెంజ్’ పేరుతో రానున్న ఈ సినిమాను 2026 మార్చి 19న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సీక్వెల్‌ను హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్‌తో పాటు అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్. మాధవన్ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ విజయం ద్వారా రణ్‌వీర్ సింగ్ తన కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌ను అందుకుని, షారుఖ్ ఖాన్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సరసన నిలిచారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

1000 crore club Aditya Dhar Bollywood Box Office Dhurandhar movie Ranveer Singh

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.