📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Ranveer Singh: 48 గంటల్లో రికార్డు సాధించిన ‘ధురంధర్-2’ ట్రైలర్

Author Icon By Saritha
Updated: March 10, 2026 • 2:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Ranveer Singh: బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మరో భారీ సునామీ రాబోతోంది. ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్, ‘ఉరి’ సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్: ది రివెంజ్’ (ధురంధర్ పార్ట్-2) ట్రైలర్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. మార్చి 7న విడుదలైన ఈ ట్రైలర్, కేవలం 48 గంటల్లోనే అన్ని ప్లాట్‌ఫామ్‌లలో కలిపి 312 మిలియన్ల వ్యూస్ సాధించి భారతీయ సినిమా చరిత్రలో కనీవినీ ఎరుగని రికార్డును నెలకొల్పింది. 45 దేశాల్లో యూట్యూబ్ ట్రెండింగ్‌లో అగ్రస్థానంలో నిలవడం ఈ సినిమాపై ఉన్న అంతర్జాతీయ క్రేజ్‌కు అద్దం పడుతోంది.

Read Also: Lavanya Tripathi: అసభ్యకర ట్రోలింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య త్రిపాఠి

Ranveer Singh: ‘Dhurandhar-2’ trailer sets record in 48 hours

ఉగాది కానుకగా మార్చి 19న విడుదల

ఈ చిత్రంలో రణవీర్ సింగ్ ‘జస్కీరత్ సింగ్ రంగీ’, ‘హమ్జా’ అనే రెండు విభిన్న కోణాలున్న పాత్రల్లో కనిపిస్తుండటం అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. ముఖ్యంగా పాకిస్థాన్‌లోని ల్యారీ టౌన్ నేపథ్యంలో సాగే ఈ ప్రతీకార కథలో యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయని ట్రేడ్ వర్గాలు ప్రశంసిస్తున్నాయి.

గతేడాది డిసెంబర్‌లో విడుదలైన మొదటి భాగం ఏకంగా రూ. 1,300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తున్న ‘ధురంధర్ 2’ అంతకు మించిన రికార్డులను తిరగరాస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్చి 19న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Action Thriller Aditya Dhar bollywood Dhurandhar 2 Indian Cinema Ranveer Singh

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.