Ranveer Singh: ధురంధర్ 2 లొకేషన్ మేనేజర్‌పై కేసు నమోదు!

Read Time:  1 min
Ranveer Singh
Ranveer Singh
FONT SIZE
GET APP

Ranveer Singh: రణవీర్ సింగ్, సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ మూవీ ‘ధురంధర్ 2’ ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది. అయితే, తాజాగా ముంబై పోలీసుల నిబంధనలను అతిక్రమించినందుకు ఈ చిత్ర బృందం చిక్కుల్లో పడింది.

Ranveer Singh: Case registered against Dhurandhar 2 location manager!
Ranveer Singh: Case registered against Dhurandhar 2 location manager!

అసలేం జరిగిందంటే?

ఫిబ్రవరి 1న దక్షిణ ముంబైలోని కీలకమైన పోర్ట్ ఏరియాలో చిత్ర షూటింగ్ జరిగింది. ఈ షెడ్యూల్‌లో నటుడు సంజయ్ దత్ కూడా పాల్గొన్నారు. అయితే, భద్రతా పరంగా అత్యంత సున్నితమైన ఈ జోన్‌లో పోలీసుల అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాలను ఉపయోగించి దృశ్యాలను చిత్రీకరించారు. నిబంధనల ప్రకారం కఠిన ఆంక్షలు అమల్లో ఉన్న ఈ ప్రాంతంలో డ్రోన్ వినియోగం పోలీసుల దృష్టికి రావడంతో వెంటనే రంగంలోకి దిగారు.

లొకేషన్ మేనేజర్‌పై ఎఫ్‌ఐఆర్

అవసరమైన ముందస్తు అనుమతులు తీసుకోకుండా డ్రోన్ ఆపరేట్ చేసినందుకు గానూ, చిత్ర లొకేషన్ మేనేజర్ రింకూ రాజ్‌పాల్ వాల్మీకిపై పోలీసులు కేసు (FIR) నమోదు చేశారు. ఈ వ్యవహారంపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.