బాలీవుడ్‌లోకి మరో వివాదానికి తెర తీయబడింది – హీరో రణబీర్ కపూర్ ఓ వెబ్ సిరీస్‌లో కనిపించగా అతడు ఇ-సిగరెట్ తాగుతూ కనిపించటంతో కొత్త సమస్య ఏర్పడింది. ఈ సిరీస్ పేరు The Bads of Bollywood, దర్శకత్వం అర్యాన్ ఖాన్. వహించారు. రణబీర్ కపూర్ పై ఇప్పుడు ఏకంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) చర్యలు తీసుకోడానికి సిద్ధమైంది.
చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలతో వెంటనే అతడిపై కేసు నమోదు చేయాలని ముంబై పోలీసులను ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది. షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ తెరకెక్కించిన ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ సిరీస్ ఇటీవలే నెట్ ఫ్లిక్స్ (Netflix) వేదికగా స్ట్రీమింగ్ కు వచ్చిన సంగతి తెలిసిందే. హిందీ చిత్ర పరిశ్రమలోని పరిస్థితులకు అద్దంపట్టే ఈ వెబ్ సిరీస్ లో పలువురు పాపులర్ స్టార్స్, దర్శక నిర్మాతలు అతిథి పాత్రలు పోషించారు.
రణబీర్ కపూర్ నటించడంపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆగ్రహం వ్యక్తం
వారిలో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) కూడా ఉన్నారు. అయితే అందులో ఆయన ఎలక్ట్రానిక్ సిగరెట్ తాగుతూ కనిపించడమే ఇప్పుడు తంటాలు తెచ్చిపెట్టింది. ఇ- సిగరెట్ (E-cigarette) నిషేధ చట్టాన్ని అతిక్రమించడంపై మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది.ఎలక్ట్రానిక్ సిగరెట్ల చట్టాన్ని ఉల్లంఘించి, ఇ- సిగరెట్‌ను వినియోగిస్తూ రణబీర్ కపూర్ నటించడంపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
అతనితో పాటుగా ఆ సిరీస్ నిర్మాతలు, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్ పైనా కేసు నమోదు చేయాలని ఆదేశించింది. యువతను తప్పుదోవ పట్టించే ఇలాంటి కంటెంట్‌పై తగిన చర్యలు తీసుకోవాంటూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది.భారతదేశంలో ఇ- సిగరెట్ (E-cigarette) లను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే.
ఇండియాలో బ్యాన్ చేయబడిన ఎలక్ట్రానిక్ సిగరెట్
2019 నుంచే ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధ చట్టం అమల్లో ఉంది. దీని కింద ఇ-సిగరెట్ల ఉత్పత్తి, తయారీ, దిగుమతులు ఎగుమతులు, రవాణా, విక్రయం, పంపిణీ, నిల్వ, వినియోగం, ప్రకటనలపై నిషేధం విధిస్తారు. ఇండియాలో బ్యాన్ చేయబడిన ఎలక్ట్రానిక్ సిగరెట్ తో రణబీర్ కపూర్ కలిసి నటించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై రణబీర్, ‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ టీమ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: