📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Rana: 8 గంటల వర్క్ వివాదంపై స్పందించిన రానా

Author Icon By Anusha
Updated: December 3, 2025 • 1:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇండస్ట్రీలో పనిగంటలపై కొంతకాలంగా చర్చ జరుగుతోంది. తాను రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేస్తానని బాలీవుడ్ నటి దీపికా (Deepika Padukone) స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మిగతా రంగాల తరహాలోనే ఇండస్ట్రీలోనూ నిర్ణీత పని గంటలు ఉండాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై తాజాగా టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రానా (Rana) స్పందించారు.

Read Also: Bigg Boss 9: టికెట్‌ టూ ఫినాలే టాస్క్‌లో తనూజ విన్నర్

నటన అంటే ఉద్యోగం కాదు

“సినిమా రంగం సాధారణ ఉద్యోగంలాంటి కాదు. నటన అనేది ఒక ఉద్యోగం కాదు. అది లైఫ్‌స్టైల్. ఎనిమిది గంటలు కూర్చొని అద్భుతమైన అవుట్‌పుట్ వచ్చే ఫీల్డ్ ఇది కాదు” అని రానా అన్నారు. సినిమాలు తయారయ్యే ప్రక్రియ మొత్తం ఒక టీమ్ కట్టుబాటుపై ఆధారపడి ఉంటుందని, అందరూ కలిసి అంకితభావంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

“ఒక గొప్ప సీన్ రావాలంటే కెమెరా నుంచి లైటింగ్ వరకు, నటీనటుల నుంచి టెక్నీషియన్లవరకూ అందరూ సమయం పట్టించుకోకుండా పనిచేస్తారు. ఇక్కడ 8 గంటల రూల్ పెట్టేయడం ప్రాక్టికల్‌గా కరెక్ట్ కాదు” అని రానా (Rana) ఘాటుగా వ్యాఖ్యానించారు.

Rana responds to 8-hour work controversy

దుల్కర్‌ సల్మాన్ స్పందిస్తూ..

దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) కూడా ఈ చర్చలో తన అభిప్రాయం చెప్పారు. ‘వివిధ పరిశ్రమలలో వర్క్ మోడల్ వేరు వేరుగా ఉంటుంది. తెలుగులో మహానటి (Mahanati movie) చేస్తున్నప్పుడు కొన్నిసార్లు సాయంత్రం ఆరు గంటలకే ఇంటికి వెళ్లే అవకాశం ఉన్నది.

తమిళంలో పరిస్థితి పూర్తిగా వేరు. ఆదివారాలు కూడా సెలవు ఇస్తారు. ఒకేరోజు అతిగా పనిచేయడం కంటే, రోజూ కొంచెం అదనంగా పనిచేయడం బెస్ట్” అని దుల్కర్ అభిప్రాయపడ్డారు. ప్రతి పరిశ్రమ తన స్వంత రీతిలో నడుస్తుందని, అక్కడి వర్క్ స్టైల్‌ను బట్టి పని వ్యవధి మారుతుందని ఆయన స్పష్టం చేశారు. 

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

acting lifestyle Film Industry latest news not a regular job Rana Daggubati Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.