గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ramcharan) హీరోగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సినిమా ‘పెద్ది’(Peddi)పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా మార్చి 27న, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా, విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ ప్రేక్షకులలో భారీ హైప్ క్రియేట్ చేశాయి.
Read Also: Sonakshi Sinha: టాలీవుడ్ వర్కింగ్ స్టైల్‌పై సోనాక్షి కామెంట్స్
ఇప్పుడేమో చిత్రబృందం అభిమానుల కోసం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. తాజాగా విడుదల చేసిన ‘చికిరి’ సాంగ్ ప్రోమో సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. రామ్ చరణ్(Ramcharan) ఎనర్జీ, స్టెప్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ ఫ్యాన్స్‌కి ఫుల్ ఫీలింగ్ ఇచ్చాయి. ఇక పూర్తి పాటను నవంబర్ 7న విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రానికి ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రోమోకే ఇంత హంగామా అంటే… పూర్తి సాంగ్ వస్తే సోషల్ మీడియాలో మరింత హైప్ ఖాయమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: