పౌరాణిక కథలపై వచ్చే చిత్రాలు ఎప్పుడూ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తిస్తాయి. ప్రస్తుతం బాలీవుడ్‌లో నితేష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న రామాయణ(Ramayana vs Varanasi) అదే తరహా అటెన్షన్‌ను అందుకుంటోంది. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో నటిస్తుండగా, మొత్తం కథ వాల్మీకి రామాయణాన్ని నిజమైన పద్ధతిలో అనుసరించేలా తీస్తున్నట్లు సమాచారం.
Read Also: Tollywood: అల్లు అర్జున్ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో కొత్త సినిమా టాక్

ఇక మరోవైపు దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి(S.S. Rajamouli,), సూపర్‌స్టార్ మహేష్ బాబుతో కలిసి వరణాసి అనే భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది పౌరాణిక అంశాలతో పాటు కొత్తగా రూపొందించిన కథాంశం కలయికగా రూపొందుతుంది. రామాయణంలోని ఒక ప్రముఖ ఘట్టాన్ని తీసుకుని, టైమ్ ట్రావెల్ ఎలిమెంట్లతో కలిసి వినూత్నంగా చూపించనున్నారని రాజమౌళి ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. ఈ చిత్రం 2027 సమ్మర్‌లో విడుదలయ్యే అవకాశం ఉన్నదని వినిపిస్తోంది.
రెండు సినిమాల మధ్య సహజంగానే పోలికలు
రామాయణం, వరణాసి(Ramayana vs Varanasi) రెండు భారీ బడ్జెట్ చిత్రాలు కావడంతో ప్రేక్షకులు రెండింటినీ పోల్చడం అనివార్యమవుతోంది. రామాయణం కథను సింపుల్‌గా, క్లాసిక్ పద్ధతిలో చూపించే ప్రయత్నమైతే, వరణాసిలో విజువల్స్, కథ నిర్మాణం, టైమ్‌లైన్‌ల మేళవింపు రాజమౌళికి ఒక పెద్ద సవాలు.
రాజమౌళి మాటల్లో మహేష్ బాబు – శ్రీరాముడి రూపం
ఇటీవల జరిగిన టైటిల్ ఈవెంట్‌లో రాజమౌళి మాట్లాడుతూ:
- మహేష్ బాబు శ్రీరాముడి వేషంలో కనిపించగానే తనకు గూస్‌బంప్స్ వచ్చాయని,
- మహೇಶ್లో కృష్ణుడి ఆకర్షణ, రాముడి ప్రశాంతత రెండూ ఉన్నాయని,
- ఒక కీలక సన్నివేశాన్ని 60 రోజులపాటు చిత్రీకరించాల్సి వచ్చిందని వెల్లడించారు.
ఈవెంట్‌లో లీకైన టీజర్‌పై రాజమౌళి అసంతృప్తి వ్యక్తం చేయడం కూడా హాట్ టాపిక్ అయింది.
రాబోయే కాలంలో భారీ పోటీ
ఈ రెండు చిత్రాలు విడుదలయ్యే సమయానికి బాక్సాఫీస్ వద్ద పాన్–ఇండియా స్థాయి పోటీ అనివార్యం. రామాయణం తన క్లాసిక్ కథతో, వరణాసి తన వినూత్న కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు పోటీ పడనున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: