📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Ram Gopal Varma: నేడు పోలీసు విచారణకు హాజరు కానున్న రామ్ గోపాల్ వర్మ

Author Icon By Sharanya
Updated: August 12, 2025 • 2:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)మరోసారి వార్తల్లోకెక్కారు. గతంలో విడుదలైన ‘వ్యూహం’ సినిమాకు సంబంధించిన వివాదంలో వర్మపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. తాజా పరిణామాలతో, వర్మ ఈరోజు ఒంగోలు పోలీస్ స్టేషన్ విచారణకు హాజరవుతారా? అన్నదే ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది.

Ram Gopal Varma

వివాదానికి కారణమైన మార్ఫింగ్ ఫొటోలు

విడుదలైన వ్యూహం సినిమా ప్రమోషన్ (movie promotion)సమయంలో వర్మ తన సోషల్ మీడియా ఖాతాల్లో రాష్ట్ర రాజకీయ నాయకులైన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్‌ల మార్ఫింగ్ ఫోటోల(Morphing photos)ను షేర్ చేశారు. వీటికి తోడు చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఆరోపిస్తూ మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది.

హైకోర్టు బెయిల్ – విచారణకు హాజరు కావాల్సిన షరతు

వర్మ (Ram Gopal Varma)ఈ కేసులో హైకోర్టులో బెయిల్ పొందారు. అయితే, పోలీసులు జరిపే విచారణకు తప్పకుండా హాజరుకావాలని న్యాయస్థానం షరతు విధించింది. ఈ నేపథ్యంలో, వర్మ గత ఫిబ్రవరిలో ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌కు విచారణ నిమిత్తం హాజరయ్యారు.

పోలీసుల రెండోసారి నోటీసు – వర్మ హాజరు కానున్నారా?

జులై 22న పోలీసులు వర్మకు మరోసారి నోటీసులు పంపారు. ఆ నోటీసులపై స్పందించిన వర్మ, ఆగస్టు 12న విచారణకు హాజరవుతానని చెప్పారు. దీంతో పోలీసులు వర్మ హాజరయ్యే క్రమంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కానీ, ఆయన వాస్తవంగా హాజరవుతారా? లేదా ఎప్పటిలాగే చివరి నిమిషంలో మళ్లీ డుమ్మా కొడతారా? అనే ప్రశ్న ప్రస్తుతం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Read hindi news:hindi.vaartha.com

Read also:

https://vaartha.com/mrunal-thakur-clarifies-dhanush-dating-rumours/cinema/529338/

Breaking News latest news Morphing Case ongole police Political Satire Ram Gopal Varma RGV Telugu Cinema News Telugu News Vyooham Controversy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.