📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Ram Gopal Varma: కుక్కలపై ప్రేమ ఉంటే గెస్ట్ రూమ్స్‌లో ఉంచండి: ఆర్జీవీ

Author Icon By Anusha
Updated: August 19, 2025 • 1:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పటికప్పుడు తన విభిన్న ఆలోచనలు, వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) మళ్లీ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. ఈసారి ఆయన టార్గెట్ వీధికుక్కల (stray dogs) సమస్య. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో వీధికుక్కల సమస్య తీవ్రతరం అవుతోంది. పిల్లలపై, వృద్ధులపై, రాత్రివేళల్లో నడిచే సాధారణ ప్రజలపై కుక్కల దాడులు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో వీధికుక్కల సమస్యకు శాశ్వత పరిష్కారం ఏమిటి అన్నదానిపై సమాజంలో చర్చ జరుగుతూనే ఉంది. కొందరు వీధికుక్కలను పట్టుకొని వేరే ప్రాంతాలకు తరలించమని సూచిస్తుంటే, మరికొందరు వాటిని హింసించకుండా నియంత్రణ చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు.

తమ ఇళ్లలోని గెస్ట్ రూమ్స్‌లో ఉంచుకోవాలని

ఈ నేపధ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. శునక ప్రేమికులపై విమర్శలు చేస్తూ, వారు చూపే హృదయపూర్వకత కేవలం సోషల్ మీడియా వరకు మాత్రమే పరిమితమైందని ఆయన స్పష్టం చేశారు. నిజంగా కుక్కలంటే ఇంత ప్రేమ ఉంటే, వాటిని వీధిలో వదిలేయకుండా తమ ఇళ్లలోని గెస్ట్ రూమ్స్‌లో ఉంచుకోవాలని సూటిగా చెప్పారు. “వీధికుక్కల కోసం కన్నీళ్లు కారుస్తున్న వారంతా ఎందుకు వాటిని దత్తత తీసుకోరని” ఆయన ప్రశ్నించారు.ఈ అంశంపై తన ఎక్స్‌ (ట్విట్టర్) ఖాతాలో ఆర్జీవీ ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. “అందరూ ‘కుక్కలను తరలించండి, తరలించండి’ అని ఏదో మంత్రంలా జపిస్తున్నారు. కానీ తరలింపు అనేది ఒక వీధిలోని సమస్యను మరో వీధికి నెట్టడానికి వాడే మర్యాదపూర్వకమైన పదం తప్ప మరొకటి కాదు” అని వర్మ వ్యాఖ్యానించారు. ఒక ప్రాంతంలోని కుక్కలను ఖాళీ చేస్తే, కొద్ది రోజుల్లోనే ఆ ప్రదేశంలోకి కొత్త కుక్కలు, కొన్నిసార్లు అంతకంటే ప్రమాదకరమైనవి కూడా వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Ram Gopal Varma

శునక ప్రేమికులపై విమర్శలు గుప్పిస్తూ

దేశంలో దాదాపు ఏడు కోట్ల వీధికుక్కలు ఉన్నాయని గుర్తుచేస్తూ, “లక్షల కొద్దీ ఉన్న ఈ కుక్కలను మీరు ఎక్కడికి పంపాలని అనుకుంటున్నారు?” అని వర్మ సూటిగా ప్రశ్నించారు. తరలింపు అనేది ఒక పరిష్కారం కాదని, కఠినమైన నిర్ణయాలు తీసుకోలేక అజ్ఞానులు చెప్పే సాకు మాత్రమేనని అన్నారు.శునక ప్రేమికులపై విమర్శలు గుప్పిస్తూ, “శాటిన్ కుషన్లపై విదేశీ జాతి కుక్కలను పెట్టుకుని ఏసీ ఇళ్లలో కూర్చుని లెక్చర్లు ఇస్తారు. కానీ వీధుల్లో అసలైన ముప్పును ఎదుర్కొనేది మాత్రం పేద ప్రజలే. వారికి కుక్కలపై అంత శ్రద్ధ ఉంటే, వాటి కోసం వారి గెస్ట్ రూమ్స్ తెరవాలి” అని పేర్కొన్నారు. తమ విలాసవంతమైన ఇళ్లను, పిల్లలను కుక్కల బారి నుంచి కాపాడుకుంటూ, ప్రభుత్వానికి మాత్రం తరలింపు సలహాలు ఇవ్వొద్దని వర్మ హితవు పలికారు. గతంలో కూడా వర్మ ఈ అంశంపై మాట్లాడుతూ, దేవుడు అన్ని జీవులను సృష్టించాడని చెప్పేటప్పుడు బొద్దింకలు, ఎలుకలు, పాములు, దోమలు, పిల్లలను చంపే వీధికుక్కలను పరిగణనలోకి తీసుకోలేదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

ఆయన తొలి సినిమా ఏది?

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా శివ (1990). నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమలో సంచలన విజయం సాధించింది.

రామ్ గోపాల్ వర్మ ప్రత్యేకత ఏమిటి?

ఆయన సినిమాలు వాస్తవానికి దగ్గరగా ఉండే కథలు, టెక్నికల్ ఎక్స్‌పెరిమెంట్స్, కొత్త రకం కెమెరా యాంగిల్స్‌ వాడకం, గ్యాంగ్‌స్టర్ డ్రామాల రూపకల్పనలో ప్రత్యేక గుర్తింపు పొందాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/dowry-harassment-case-on-actor-dharma-mahesh/cinema/532465/

animal lovers criticism Breaking News dog relocation problem latest news Ram Gopal Varma rgv comments stray dogs issue street dogs controversy Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.