📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Latest News: RGV: రాజమౌళి వివాదం.. విమ‌ర్శ‌కుల‌కు రామ్ గోపాల్ వర్మ కౌంట‌ర్

Author Icon By Anusha
Updated: November 21, 2025 • 4:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దిగ్గజ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి (S.S. Rajamouli) ఇటీవల గ్లోబ్ ట్రాటర్ సినిమా ఈవెంట్‌లో దేవుడిపై నమ్మకం లేదంటూ రాజమౌళివ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. రాజమౌళి క్షమాపణలు చెప్పాలంటూ పలు హిందూ సంఘాలు, బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దేవుడిపై నమ్మకం లేదంటూ దేవుడిపై ఎందుకు సినిమాలు తీస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు.

Read Also: SBI Insurance: ఎస్‌బీఐ వెబ్సైట్ లో.. పైరసీ సినిమాలు ప్రత్యక్షం

ఈ వివాదంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్న తరుణంలో, వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు. రాజమౌళికి మద్దతుగా పోస్ట్ పెడుతూ, విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చారు.”రాజమౌళిపై విషం కక్కుతున్న సోకాల్డ్ ధర్మ రక్షకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే… భారతదేశంలో నాస్తికుడిగా (Atheist) ఉండటం నేరం కాదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 దేవుడిని విశ్వసించకపోవడాన్ని కూడా రక్షిస్తుంది.

అందుకే, మీరు దేవుడిని నమ్ముతున్నామని చెప్పే హక్కు మీకు ఎంత ఉందో, రాజమౌళికి కూడా తనకు దేవుడిపై నమ్మకం లేదని చెప్పే హక్కు అంతే ఉంది. అయితే రాజమౌళి దేవుడిని నమ్మకపోతే తన సినిమాల్లో దేవుడిని ఎందుకు చూపిస్తున్నాడు? అనేది మూర్ఖపు వాదన. ఆ లెక్కన, గ్యాంగ్‌స్టర్ సినిమా తీయాలంటే దర్శకుడు గ్యాంగ్‌స్టర్‌గా మారాలా? హారర్ సినిమా కోసం దెయ్యంగా మారాలా? అని ఆర్జీవీ విమర్శకులను ప్రశ్నించారు.

రాజమౌళితో దేవుడికే సమస్య లేనప్పుడు మీకెందుకు

నిజం చెప్పాలంటే… రాజమౌళి దేవుడిని నమ్మకపోయినా చాలా మంది దేవుడిని నమ్మేవారు కూడా తమ జీవితాల్లో చూడనంత విజయం, సంపద నాస్తికుడైన రాజ‌మౌళికి ఇచ్చాడు. దీనిని బట్టి చూస్తే దేవుడు నాస్తికులనే ఎక్కువగా ప్రేమిస్తున్నాడేమో, లేదా దేవుడు అస‌లు జ‌నాల‌ను ప‌ట్టించుకోడేమో? లేదంటే ఎవరు నమ్ముతున్నారని లెక్కలు రాసుకునే నోట్‌ప్యాడ్ పట్టుకొని దేవుడు కూర్చోలేదేమో? అని ఆర్జీవీ (RGV) వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

రాజమౌళితో దేవుడికే సమస్య లేనప్పుడు, ఈ స్వయం ప్రకటిత ధర్మ రక్షకులైనవారు (God Mongers) ఎందుకు బీపీ, అల్సర్‌ తెచ్చుకుంటున్నారు? నిజమైన సమస్య ఆయన నాస్తికత్వం కాదు. దేవుడిని నమ్మకుండానే ఆయన విజయం సాధించడమే అసలు సమస్య. ఎందుకంటే దేవుడిని పిచ్చిగా ప్రార్థించినా విజయం సాధించలేని వారిని ఇది భయపెడుతోంది అని ఆర్జీవీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దేవుడి ని, రాజమౌళి నీ అర్థం చేసుకోలేని వాళ్ళు బాధపడుతున్నారు

విశ్వాసులు దేవుడిని రక్షించడం మానేయాలి. అది దేవుడిని అవమానించినట్లే. రాజమౌళి నాస్తికుడైనంత మాత్రాన దేవుడి శక్తి తగ్గదు. నమ్మకం ఆగిపోయిన వెంటనే విశ్వాసం కూలిపోతుందని భావించే వారి ఇన్ సెక్యురిటీ మాత్రమే పెరుగుతుంది అని ఆర్జీవీ అన్నారు.చివ‌రిగా.. దేవుడు బాగానే ఉన్నాడు. రాజమౌళి బాగానే ఉన్నాడు.

వీరిద్దరినీ అర్థం చేసుకోలేని వారు మాత్రమే బాధపడుతున్నారు. రాజమౌళి తదుపరి చిత్రం ‘వారణాసి’ ద్వారా దేవుడు ఆయన బ్యాంకు బ్యాలెన్స్‌ను మరింత పెంచుతాడు. దేవుడి నమ్మకం పేరుతో అసూయ పడుతున్న వాళ్లు ఏడుస్తూ కూర్చోవడమే. జై హనుమాన్ అంటూ” ఆర్జీవీ తన వ్యాఖ్యలను ముగించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

latest news RGV supports Rajamouli SS Rajamouli controversy Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.