Ram Charan: స్పెషల్‌ ఫొటో పంచుకున్న నటుడు

Read Time:  1 min
Ram Charan: స్పెషల్‌ ఫొటో పంచుకున్న నటుడు
FONT SIZE
GET APP

నటుడు రామ్‌చరణ్ (Ram Charan), మరోసారి వార్తల్లో నిలిచారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు రెండోసారి తల్లిదండ్రులయిన సంగ‌తి తెలిసిందే.. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి పుట్టడంతో మెగా కుటుంబం అంతా ఆనందంలో మునిగిపోయింది. అభిమానులు కూడా ఈ శుభవార్తను ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే ఈ సందర్భంగా రామ్ చరణ్ ఒక స్పెష‌ల్ ఫొటోను షేర్ చేశారు.

Read Also: Singeetam Srinivasa Rao: 94 ఏళ్ల వయసులో సినిమా డైరెక్ట్ చేయనున్న సింగీతం శ్రీనివాసరావు

 Ram Charan shared a special photo
Ram Charan shared a special photo

మహిళలే గొప్ప

తన భార్య ఉపాసన, పెంపుడు కుక్కలతో కలిసి ఉన్న అందమైన ప్రెగ్నెన్సీ ఫోటోషూట్‌ను పంచుకుంటూ, తమ జీవితంలోకి కొత్త అతిథులు రావడం పట్ల ఎమోషనల్ అయ్యారు. క్లింకారతో కలిపి ఇప్పుడు ముగ్గురు పిల్లల తండ్రి అయినందుకు చాలా కృతజ్ఞతగా ఉందని, తమ జీవితంలో మహిళలే గొప్ప బలమని ఆయన (Ram Charan) పేర్కొన్నారు.

కాగా ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో వైర‌ల్‌గా మారింది.ఇక సినిమాల విషయానికి వస్తే, రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చి బాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాలో నటిస్తున్నారు. ఈ పాన్ ఇండియా సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.