టాలీవుడ్‌లో స్టార్ హీరోగా మాత్రమే కాదు, మానవతా విలువలతో కూడిన సేవా కార్యక్రమాల ద్వారా కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లోని సుమారు 500 మంది సభ్యులు, వారి కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య బీమా (Free health insurance) సౌకర్యం కల్పించేందుకు ముందుకు వచ్చారు. గతంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ, ఈ హెల్త్ కార్డుల పంపిణీకి సంబంధించిన ప్రతిపాదనను ఆయన ఆమోదించారు.
Read Also: Director Pa. Ranjith: సినీ అవార్డ్స్ పై దర్శకుడు కీలక వ్యాఖ్యలు
సామాజిక బాధ్యత
ఈ పథకం కోసం రామ్ చరణ్ (Ram Charan) సుమారు రూ.50 లక్షల వరకు వెచ్చిస్తున్నట్లు సమాచారం. సినీ షూటింగ్‌లలో రిస్క్ తీసుకునే డ్యాన్సర్లు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ ముందడుగు వేశారు. ఈ నిర్ణయంపై డ్యాన్సర్ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.తన భార్య ఉపాసన కొణిదెలతో కలిసి ఈ సేవా కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న ఆయన,
మెగాస్టార్ చిరంజీవి బాటలోనే సామాజిక బాధ్యతను చాటుకుంటున్నారు. ప్రస్తుతం ‘పెద్ది’ వంటి భారీ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, తనను నమ్ముకున్న సినీ కార్మికుల భద్రత కోసం ఇంత పెద్ద మొత్తాన్ని కేటాయించడంపై డ్యాన్సర్ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: