దశాబ్దాల తర్వాత ఒకే తెరపై కనిపించబోతున్న దక్షిణ భారత సినీ జగత్తు దిగ్గజాలు సూపర్‌స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ (Rajni-Kamal) ఈ వార్తే అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ఈ కలయిక ఇప్పుడు నిజమవుతుందన్న సంకేతాలు వస్తుండగా, ఈ మల్టీస్టారర్ సినిమాపై కొత్త అప్‌డేట్ బయటకొచ్చింది.
Vijay Deverakonda: నేను క్షేమంగా ఉన్నా: విజయ్ దేవరకొండ
ఈ భారీ మల్టీస్టారర్‌కు యువ దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) దర్శకత్వం వహిస్తారంటూ వచ్చిన వార్తలకు ఆయన స్వయంగా తెరదించారు. దీంతో ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు ఎవరు దర్శకత్వం వహిస్తారనే దానిపై మళ్లీ ఉత్కంఠ నెలకొంది.
కోలీవుడ్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ భారీ మల్టీస్టారర్‌కు దర్శకుడిగా తొలుత లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) పేరు వినిపించింది. అయితే ఇటీవల యువ నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ పేరు తెరపైకి వచ్చింది. ఈ ప్రచారంపై ఆయన ఇటీవల స్పష్టత ఇచ్చారు.

తన సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ విషయంపై మాట్లాడిన ప్రదీప్, ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. “ప్రస్తుతం నేను దర్శకత్వంపై దృష్టి పెట్టడం లేదు. నా పూర్తి ఫోకస్ నటనపైనే ఉంది. ఆ ప్రాజెక్ట్ గురించి ఎక్కువగా మాట్లాడలేను” అని ఆయన తేల్చిచెప్పారు.
ప్రాజెక్ట్ కోసం సంప్రదిస్తే ఏం చేస్తారని ప్రశ్నించగా
అయితే, ఒకవేళ మిమ్మల్ని ఆ ప్రాజెక్ట్ కోసం సంప్రదిస్తే ఏం చేస్తారని ప్రశ్నించగా, ఆయన మౌనంగా ఉండిపోయారు.ప్రదీప్ రంగనాథన్ క్లారిటీతో ఈ ప్రాజెక్టుకు దర్శకుడు ఎవరనే దానిపై మళ్లీ సస్పెన్స్ నెలకొంది. ఆయన ప్రకటనతో చిత్రబృందం మరో దర్శకుడి కోసం అన్వేషణ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రజనీకాంత్ ‘కూలీ’ వంటి విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్నారు. మరోవైపు కమల్ హాసన్ మాత్రం ‘థగ్ లైఫ్’ వంటి చిత్రంతో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో ఈ మల్టీస్టారర్ ఇద్దరి కెరీర్‌కు కీలకం కానుండగా, ఇంతటి భారీ ప్రాజెక్టుకు ఎవరు దర్శకత్వం వహిస్తారోనని కోలీవుడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: