దర్శకుడు రాజమౌళికి (Rajamouli) ఉన్నంత క్రేజీ మరో దర్శకుడికి లేదంటే అతిశయోక్తి కాదేమో! ఆయన దర్శకత్వంలో వచ్చిన పలు సినిమాలు (Cinema) సూపర్ హిట్ కొట్టాయి. ఆయనకు బోలెడంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితేనేం తమ మనోభావాలు దెబ్బతింటే మాత్రం ఊరుకోరు.. పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు వెనుదీయరు. తాజాగా రాజమౌళి, మహేష్ బాబుతో చేయబోయే సినిమా ఈవెంట్ పూర్తయిన తర్వాత, ఆయనపై రాష్ట్రీయ వానర సేన పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Read also : Marriage vs Career: యువతపై ఉపాసన, శ్రీధర్ వెంబు భిన్న వాదనలు
హనుమంతుడి మీద కొన్ని వ్యాఖ్యలు చేశారని, అవి తమ మనోభావాలు దెబ్బతీశాయని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా మరో రెండు ఫిర్యాదులు (complaints) ఆయనపై నమోదు అయ్యాయి. అందులో ఒకటి, సినిమా ఈవెంట్ లో మహేష్ బాబుని నంది మీద వచ్చినట్లుగా చూపించారు. నందిపై కేవలం శివుడు మాత్రమే రావాలి అని..మహేష్ బాబు లాంటి హీరోని తీసుకురావడం ఏంటని రాష్ట్రీయ వానర సేన ఆక్రోశం వ్యక్తం చేస్తున్నది.
ఇంద్రుడితో మానవుడు పోరాడడం ఏంటి?
బాహుబలి ఇటీవల రీ-రిలీజ్ చేసిన తర్వాత, బాహుబలి థియేటర్నల్ వార్ అనే ఒక కామిక్ సిరీస్ రిలీజ్ చేయబోతున్నట్లు ఒక ట్రైలర్ ప్లే చేశారు. అందులో బాహుబలి రాక్షసుల పక్షాన నిలబడి ఇంద్రుడితో పోరాడుతున్నట్లుగా చూపించారు. ‘అసలు బాహుబలి లాంటి మానవుడు ఇంద్రుడితో పోరాడడం ఏంటి? అంటే దేవతలను కించపరుస్తున్నారా?’ అంటూ వానర సేన ఫైర్ అవుతోంది. ఈ నేపథ్యంలో రాజమౌళిపై మరో రెండు ఫిర్యాదులు నమోదు చేయనున్నట్లు వారు ప్రకటించారు. రాజమౌళికి ఇదొక తలనొప్పిగా పరిణమించింది. మతపరమైన అంశాలు ఎంతో సున్నితంగా ఉంటాయి. ఎవరి మనోభావాలను దెబ్బతీసే అధికారం మనకు లేదు. మత స్వేచ్ఛ తో పాటు ఇతరుల హక్కులకు, మనోభావాలకు కూడా గౌరవం ఇవ్వాల్సిందే కదా
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read also :