టాలీవుడ్ మాస్టర్ ఫిల్మ్‌మేకర్ ఎస్.ఎస్. రాజమౌళి(Rajamouli controversy) సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటారు. అయితే ఈసారి ఆయన వ్యక్తిగత నమ్మకాలపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. దేవుడిపై విశ్వాసం లేదని బహిరంగంగా చెప్పిన రాజమౌళిపై కొందరు విమర్శలతో ముందుకు వస్తున్నారు.
Read Also: Akhanda New song:జాజికాయ జాజికాయ సిద్ధం – అఖండ 2 హైప్ పీక్‌లో!
మహేశ్ బాబు కొత్త చిత్రానికి సంబంధించిన ఈవెంట్‌లో మాట్లాడుతూ, తన తండ్రి “సినిమాను హనుమంతుడు కాపాడుతున్నాడు” అన్నప్పుడు తానది అంగీకరించలేకపోయానని, ఎందుకంటే తనకు దేవుడిపై నమ్మకం లేదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు వెలుగులోకి రావడం తోనే సోషల్ మీడియా వేదికల్లో తీవ్ర చర్చ ప్రారంభమైంది.
ఈ నేపథ్యంలో 2011లో రాజమౌళి చేసిన పాత ట్వీట్ కూడా మళ్లీ వైరల్ అవుతోంది.
ఒక అభిమాని శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలపగా, రాజమౌళి(Rajamouli controversy) అప్పట్లో ఇలా స్పందించారు:
“థాంక్యూ… కానీ నాకు రాముడంటే అప్పుడూ ఇష్టం లేదు. అన్ని అవతారాల్లో కృష్ణుడే ఇష్టం” అని రిప్లై ఇచ్చారు. ఈ రెండు అంశాలను కలిపి చూపిస్తూ, రాముడి పేరుతో సినిమాలు తీసి కోట్ల ఆదాయం పొందుతూ, ఆయనపై ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారు?” అని నెటిజన్లు విమర్శిస్తూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్‌లోనే కాక, సోషల్ ప్లాట్‌ఫార్మ్స్‌లో కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: