Raashii Khanna: మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు బాబీ (కె.ఎస్. రవీంద్ర) తో చిరంజీవి మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ల ఎంపికపై ప్రస్తుతం ఫిల్మ్ నగర్‌లో ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. గ్లామరస్ బ్యూటీ రాశీ ఖన్నా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో సెకండ్ హీరోయిన్‌గా నటించబోతున్నట్లు సమాచారం.
ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల రాశీ. తొలి సినిమాతోనే తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.
బబ్లీ లుక్ లో భలే ఉందే ఈ అమ్మాయి అంటూ కుర్రాళ్లంతా రాశీ అందానికి ఫిదా అయ్యారు. తొలి సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. మీడియా రేంజ్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.
అలాగే ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల సరసన కూడా నటించి మెప్పించింది. ఎన్టీఆర్ నటించిన జై లవకుశ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్ గా చేసింది. తెలుగుతో పాటు బాలీవుడ్ పై కూడా ఫోకస్ చేసింది.. బాలీవుడ్ లో సినిమాలు సిరీస్ లు చేసింది. వీటితో పాటు తమిళ్ లోనూ ఆఫర్స్ అందుకుంది.
రాశీ ఖన్నా ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. తెలుసు కదా సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోనూ నటిస్తుంది. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ తో జరుగుతుంది.