పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్(Harish Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ (Raashi Khanna) ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అభిమానుల్లోభారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో కీలక పాత్రలో నటి రాశీ ఖన్నా నటిస్తోంది. తాజాగా షూటింగ్ సెట్స్ నుంచి కొన్ని ఆసక్తికరమైన బీటీఎస్ (బిహైండ్ ది సీన్స్) వీడియోలను అభిమానులతో పంచుకున్నారు.తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోలను షేర్ చేసిన రాశీ ఖన్నా, “యాక్షన్, కట్ మధ్య నిశ్శబ్దం ఉంటుంది.
Read also: Dhurandhar Movie: 500 కోట్ల క్లబ్‌లో కి చేరిన ‘ధురంధర్’
కొన్నిసార్లు నవ్వులు కూడా ఉంటాయి” అంటూ దర్శకుడు హరీశ్ శంకర్‌ను ట్యాగ్ చేశారు. ఈ వీడియోలను చూస్తే, ఆమె షూటింగ్‌ను ఎంతో ఆస్వాదిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. (Raashi Khanna) గతంలో కూడా పవన్ కల్యాణ్‌తో కలిసి పనిచేయడం ఒక గౌరవంగా భావిస్తున్నానని రాశీ పేర్కొన్న విషయం తెలిసిందే. ఆయనతో దిగిన ఒక సెల్ఫీని పంచుకుంటూ, ఈ సినిమా తనకు ఎప్పటికీ గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం అని ఆమె తెలిపారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో రాశీ ‘శ్లోక’ అనే ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు చిత్రబృందం గతంలో ప్రకటించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: