Raashi Khanna: పవన్ తో సినిమా.. బీటీఎస్ వీడియోలు పంచుకున్న రాశీ

Read Time:  1 min
Raashi Khanna: పవన్ తో సినిమా.. బీటీఎస్ వీడియోలు పంచుకున్న రాశీ
FONT SIZE
GET APP

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్(Harish Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ (Raashi Khanna) ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అభిమానుల్లోభారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో కీలక పాత్రలో నటి రాశీ ఖన్నా నటిస్తోంది. తాజాగా షూటింగ్ సెట్స్ నుంచి కొన్ని ఆసక్తికరమైన బీటీఎస్ (బిహైండ్ ది సీన్స్) వీడియోలను అభిమానులతో పంచుకున్నారు.తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోలను షేర్ చేసిన రాశీ ఖన్నా, “యాక్షన్, కట్ మధ్య నిశ్శబ్దం ఉంటుంది.

Read also: Dhurandhar Movie: 500 కోట్ల క్లబ్‌లో కి చేరిన ‘ధురంధర్’

కొన్నిసార్లు నవ్వులు కూడా ఉంటాయి” అంటూ దర్శకుడు హరీశ్ శంకర్‌ను ట్యాగ్ చేశారు. ఈ వీడియోలను చూస్తే, ఆమె షూటింగ్‌ను ఎంతో ఆస్వాదిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. (Raashi Khanna) గతంలో కూడా పవన్ కల్యాణ్‌తో కలిసి పనిచేయడం ఒక గౌరవంగా భావిస్తున్నానని రాశీ పేర్కొన్న విషయం తెలిసిందే. ఆయనతో దిగిన ఒక సెల్ఫీని పంచుకుంటూ, ఈ సినిమా తనకు ఎప్పటికీ గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం అని ఆమె తెలిపారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో రాశీ ‘శ్లోక’ అనే ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు చిత్రబృందం గతంలో ప్రకటించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.