ప్రభాస్(Prabhas) హీరోగా తెరకెక్కుతున్న కొత్త పాన్ ఇండియా సినిమా ‘ది రాజా సాబ్’ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. (Raaja Saab) ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ, హారర్ ఫాంటసీ కలిసిన కథతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో హీరోయిన్లుగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ నటిస్తున్నారు. ముగ్గురు కథానాయికలు ఉండటం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది.
Read Also: Shivaji: హీరోయిన్ల దుస్తులపై వ్యాఖ్యలకు అనసూయ స్ట్రాంగ్ రిప్లై
‘రాజే యువరాజే’ పాట ప్రోమో విడుదల
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమా జనవరి 9న థియేటర్లలో విడుదల కానుంది. (Raaja Saab) తాజాగా ఈ సినిమా నుంచి క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని చిత్ర యూనిట్ ఒక స్పెషల్ గిఫ్ట్‌ను అభిమానులకు అందించింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ ఒక బ్యూటిఫుల్ మ్యూజికల్ సర్ప్రైజ్‌ను విడుదల చేసింది. ‘రాజే యువరాజే..’(Raje Yuvaraje) అంటూ సాగే పాట ప్రోమోను రిలీజ్ చేస్తూ, ప్రభాస్(Prabhas) వింటేజ్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను ఖుషీ చేసింది. ఈ పాటలో థమన్ అందించిన సంగీతం మ్యాజికల్ గా ఉందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: