📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Pushpa 2: తగ్గేదేలే..!మూవీకి ఆ స్టాక్‌కి ఉన్న లింక్ ఏంటి

Author Icon By Divya Vani M
Updated: December 3, 2024 • 11:26 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పుష్ప 2 ప్రభావం: ఈ స్టాక్‌తో కోటీశ్వరులుగా మారొచ్చు! ఈ ఏడాది అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఎదురు చూస్తున్న సినిమా పుష్ప-2: ది రూల్ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్లు అర్జున్ తన కెరీర్‌లోఅత్యంత భారీ ప్రాజెక్టుగా భావిస్తున్న ఈ సినిమా విడుదలకు ముందే బిజినెస్‌లో రికార్డులు సృష్టిస్తోంది.డిసెంబర్30న ప్రారంభమైన అడ్వాన్స్ బుకింగ్ ద్వారా చిత్ర నిర్మాతలు ఇప్పటికే రూ.25 కోట్లకు పైగా ఆదాయాన్ని సొంతంచేసుకున్నట్లుమాచారం.ఈ ఊహించిన విజయానికి తగ్గట్టుగానే, మొదటి రోజు పాన్ ఇండియా స్థాయిలో రూ. 150 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకు వసూళ్లు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.సినిమా లాభాలు..

స్టాక్ మార్కెట్‌పై ప్రభావం పుష్ప-2 విడుదలతో సినీ పరిశ్రమలోనే కాకుండా స్టాక్ మార్కెట్‌లోనూ ఊపుని సృష్టించింది.సినిమా రికార్డు స్థాయి అడ్వాన్స్ బుకింగ్‌ ప్రభావంతో ప్రముఖ థియేటర్ కంపెనీ పీవీఆర్ ఐనాక్స్ షేర్లు 3 శాతంమేర పెరిగాయి.దీనివల్ల కంపెనీ మార్కెట్ క్యాప్ కేవలం కొద్ది గంటల్లోనే రూ. 426 కోట్ల మేర పెరిగింది. బిజినెస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, సినిమా వసూళ్ల విజయంతో థియేటర్ కంపెనీల షేర్లు మరింత లాభదాయకమయ్యే అవకాశముంది.

పీవీఆర్ షేర్ల ర్యాలీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ప్రకారం, ట్రేడింగ్ సెషన్‌లో పీవీఆర్ ఐనాక్స్ షేర్లు రూ.1583.40 వరకు చేరుకున్నాయి. గతవారం రూ.1540 వద్ద ముగిసిన షేర్లు, సోమవారం రోజే రూ. 39.90 మేర పెరిగి, చివరకు రూ. 1579.95 వద్ద స్థిరంగా ముగిశాయి. అయితే, కంపెనీ 2023 డిసెంబర్ 18న చేరుకున్న రూ. 1829 గరిష్ఠ స్థాయితో పోలిస్తే, ప్రస్తుతం షేర్లుదాదాపు 14 శాతం దిగువన ఉన్నాయి. పుష్ప 2 విడుదలతో కంపెనీ షేర్లు మరోసారి ఆ గరిష్ఠ స్థాయిని అధిగమించే అవకాశముందనిషకులు అంచనా వేస్తున్నారు.మార్కెట్ క్యాప్‌లో భారీ వృద్ధి శుక్రవారం పీవీఆర్ ఐనాక్స్ మార్కెట్ క్యాప్ రూ.,122.79 కోట్లుగా ఉండగా, సోమవారం అది రూ. 15,548.97 కోట్లకు చేరుకుంది. ఇది కేవలం ఒక్రోజులోనే రూ. 426 కోట్ల పెరుగుదల అని చెప్పవచ్చు.

స్టాక్ మార్కెట్ నిపుణులు పుష్ప 2 ప్రభావం స్టాక్ మార్కెట్‌పై మరిన్ని రోజులు కొనసాగుతుందని భావిస్తున్నారు.పుష్ప-2 & మార్కెట్ లింక్ సినిమా విజయాలు స్టాక్ మార్కెట్‌లో లాభాలను ఎలా ప్రభావితం చేస్తాయో పుష్ప 2 మరోసారి నిరూపిస్తోంది. కాబట్టి, ఈ థియేటర్ స్టాక్‌లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇన్వెస్టర్లు కోటీశ్వరులుగా మారే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

Pushpa 2 Box Office Collection Pushpa 2 Impact on Stock Market Pushpa 2 Movie Updates PVR Inox Market Cap Growth PVR Inox Share Price Stock Market and Movies

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.