📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Purnanavi Bhupalam Marriage: పెళ్లిపీటలెక్కిన నటి పునర్నవి.. వైరల్ అవుతున్నపెళ్లి ఫోటోలు

Author Icon By Saritha
Updated: March 21, 2026 • 4:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Purnanavi Bhupalam: తెలుగు సినీ నటి పున‌ర్న‌వి భూపాలం తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ‘ఉయ్యాల జంపాల‌’ సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టిన ఈ భామ, తన అమాయకత్వం, సహజమైన నటనతో మొదటి చిత్రంతోనే మంచి గుర్తింపు సంపాదించింది. పల్లెటూరి అమ్మాయిగా కనిపించిన ఆమె పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుని, ఆమెను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఆ తర్వాత పలు తెలుగు చిత్రాల్లో నటించినప్పటికీ, ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో కొంతకాలం సినిమాలకు దూరమైంది. ఈ సమయంలోనే బుల్లితెరపై ‘బిగ్ బాస్ తెలుగు’లో పాల్గొని మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ షో ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఆమె, ఆ తర్వాత నటనకు విరామం ఇచ్చి ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లారు. అక్కడ సైకాలజీలో మాస్టర్స్ పూర్తి చేసి ఇటీవలే తిరిగి వచ్చి, తన వ్యక్తిగత జీవితంపై దృష్టి సారించారు.

Read Also : Eid Mubarak: అభిమానులకు ఈద్ విషెస్ తెలిపిన సినీ ప్రముఖులు

View this post on Instagram

A post shared by Sonu Ksr (@sonu_ksr)

హేమంత్ వర్మతో పునర్నవి ఏడడుగులు

ప్రముఖ ఫోటోగ్రాఫర్ అయిన హేమంత్ వర్మతో తన ప్రేమ విషయాన్ని గతేడాది అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఇరు కుటుంబాల సమక్షంలో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. తాజాగా మార్చి 20న ఎలాంటి హడావుడి లేకుండా హేమంత్ వర్మను వివాహం చేసుకుంది. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వివాహ వేడుక ప్రైవేట్‌గా జరిగింది. వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్‌గా జరిగిన ఈ వేడుకకు కొద్దిమంది మాత్రమే హాజరయ్యారు. ప్రస్తుతం ఈ జంటకు సోషల్ మీడియాలో అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నపున‌ర్న‌వి ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. భవిష్యత్తులో ఆమె మళ్లీ సినిమాల్లోకి వస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Bigg Boss 3 Telugu Hemanth Varma Punarnavi Bhupalam Punarnavi Wedding Photos Uyyala Jampala Actress

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.