ఐబొమ్మ వెబ్‌సైట్ అడ్మిన్ ‘రవి’ అరెస్ట్ టాలీవుడ్‌లో పెద్ద చర్చగా మారిన వేళ, సోషల్ మీడియాలో ఒక వింత ట్రెండ్ కనిపిస్తోంది. సినిమా టికెట్ రేట్లు అధికంగా ఉన్నాయనే పేరుతో పైరసీని సమర్థించే పోస్టులు పెరుగుతుండగా..“మాకు పైరసీ చేసేవాడే హీరో” అని కొందరిని ట్వీట్‌లు, రీల్స్ పెట్టడం ఇండస్ట్రీలోని పలువురిని ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత బన్నీ వాసు (Bunny Vas) ఘాటుగా స్పందించారు.
Read Also: Mahavatar Narsimha: హోంబలే యానిమేషన్ మూవీకి అంతర్జాతీయ గుర్తింపు
పైరసీని సమర్థించే ధోరణిపై అసహనం
‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, పైరసీని సమర్థించే ధోరణిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పైరసీ వల్ల ఎంతో మంది చిన్న సినిమాల నిర్మాతలు నష్టపోతున్నారని బన్నీ వాస్ (Bunny Vas) అన్నారు. పైరసీ తప్పని, అలాంటి తప్పును కొందరు తమకు లాభం కలిగిందని సమర్థించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.
ఏడాదిలో 10-15 సినిమాలకే టికెట్ రేట్స్ పెంచుతున్నారని పేర్కొన్నారు. కానీ ఆ సినిమాలకే కాకుండా మిగతా చిత్రాలూ పైరసీకి గురవుతున్నాయని తెలిపారు. పైకి బాగానే కనిపిస్తున్నా ఆ నిర్మాతలు లోపల బాధ పడుతున్నారన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: